twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ మ్యాటర్ మళ్లీ రూమర్ అని తేల్చారు

    By Srikanya
    |

    Akhil Akkineni
    హైదరాబాద్: అక్కినేని ఎంట్రీపై ఏదో ఒక వార్త రావటం, తర్వాత అది రూమర్ అని తేల్చేయటం చాలా చాలా కామన్ అయిపోయింది. తాజాగా మరో వార్త అని ప్రచారంలోకి వచ్చింది రూమర్ అని రెండు రోజులు కాకముందే తేలిపోయింది. ఈ సారి వచ్చిన రూమర్ ఏమిటంటే..'మనం'లో అక్కినేని అఖిల్ గెస్ట్‌రోల్ చేస్తున్నారని...ఈ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రంలో అఖిల్ చేయటం లేదని తేలింది.

    అక్కినేని మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'మనం' . శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం లో . ఈచిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి జనవరిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్న అక్కినేని నాగేశ్వరరావు తాజాగా 'మనం' షూటింగులో పాల్గొంటున్నారు.

    శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వందశాతం కామెడీతో మంచి లవ్ ఫీల్‌తో మంచి ఎమోషనల్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావు గారికి 90 ఏళ్లు వచ్చినా సెట్‌లో అందర్నీ నవ్విస్తూ ప్లెజెంట్ ఎట్మాస్పియర్‌ని క్రియేట్ చేస్తారు. యూనిట్లో అందరికంటే ఎనర్జిటిక్‌గా ఉంటూ అందరినీ ఉత్సాహపరుస్తారు. ఆయనొక లెజెంట్. లెజెండ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు దర్శకుడు.

    ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    English summary
    Akhil Akkineni, actor Nagarjuna's youngest son, will not be doing a cameo in the Akkineni multistarrer,Manamdirected by Vikram Kumar. Sources close to the unit confirm that he's not a part of the movie, as speculated. Looks like Akkineni fans will have to wait longer to catch a glimpse of the Akhil on screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X