‘అజ్ఞాతవాసి’: పవన్ ఫ్యాన్స్ ఆశలు వదులుకోవడమే బెటర్!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది.
సాధారణంగా అయితే ఆస్థాయి హీరో సినిమా వస్తుంది అంటే ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఇంటర్వ్యూలు అంటూ సందడిగా ఉంటుంది. అయితే 'అజ్ఞాతవాసి' విషయంలో అలాంటి సందడి కనిపించడం లేదు.

ఫ్యాన్స్ ఆశలు వదులుకోవడమే బెటర్!
‘అజ్ఞాతవాసి' సినిమా విషయంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లాంటి జరుగుతాయని అభిమానులు ఆశలు పెట్టుకోవద్దనే వాదన వినిపిస్తోంది. ఈ సినిమా విషయంలో అలాంటివేమీ ఉండవని, ఫ్యాన్స్ ఈ విషయంలో అశలు వదులుకోవాల్సిందే అంటున్నారు.

వద్దని చెప్పిన పవన్ కళ్యాణ్
‘అజ్ఞాతవాసి' సినిమా విషయంలో ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ నిర్వహించడం అవసరం లేదని, ఆడియో నేరుగా మార్కెట్లోకి విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం. ఒక వేళ నిర్వహించిన తాను మాత్రం రాను అని పవన్ చెప్పేశాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

నిర్మాత ఆసక్తిగా ఉన్నారు
అయితే పవన్ కళ్యాణ్ రాక పోయినా.... సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారట. ప్రమోషన్స్ ఏవిధంగా నిర్వహించాలనే దానిపై త్వరలో ఓ క్లారిటీ రానుంది.

ఆడియో రిలీజ్ ఎప్పుడు?
డిసెంబర్ 20న పాటలు విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సారి హైదరాబాద్ లో కాకుండా గుంటూరు లేదా విజయవాడలో ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట బయటకు రాగా మంచి రెప్సాన్స్ వస్తోంది.

నమ్మకంగా ఉన్న ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్టే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి' సినిమాతో వీరు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ నటిస్తున్నారు. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు.

సంక్రాంతి రిలీజ్
హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2018జ నవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











