పెళ్లికి ఐదు రోజులు.. హానిమూన్‌కి... : చెర్రీ
రామ్ చరణ్ ఇప్పుడు చాలా బిజీబిజీగా వర్క్ లో మునిగితేలుతున్నాడు. చివరకు తన స్నేహితులకు బ్యాచ్ లర్ పార్టీ కూడా ఇవ్వలేని స్దితిలో ఉన్నాడు. కేవలం ఈ మూడు నెలల్లో తన పనికి తొమ్మిది రోజులు మాత్రమే శెలవు పెడుతున్నాడు. అవి కూడా ఐదు రోజులు పెళ్లికి...నాలుగు రోజులు హానీమూన్ నిమిత్తం. జూలై లో చరణ్ వివాహం జరగనుంది. ఈ లోగా ఒప్పుకున్న ప్రాజెక్టులు ఫినిష్ చేద్దామనుకున్నాడు కానీ..అది సాధ్యపడక ఇలా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్తున్నారు.
ఇక నిన్న గురువారం విడుదలైన రచ్చ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవటం అతనికి ఆనందం కలగచేసిందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం పూర్తిగా వివి వినాయిక్ చిత్రానికి పని చేస్తున్నారు. సైమన్టైనిస్ గా వంశీ పైడిపల్లి దర్సకత్వంలో రూపొందనున్న ఎవడు చిత్రం కూడా జరగనుంది. ఇక వినాయిక్ చిత్రం షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ఈ మధ్యనే జరిగింది. ఆ షెడ్యూల్ లో ఫైట్ ని ఫినిష్ చేసారు.
వినాయిక్ చిత్రంలో చరణ్ ఓ భాధ్యత గల కొడుకుగా కనిపించనున్నాడు. ఆకుల శివ కథ అందిస్తున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. దానికి తోడు వినాయిక్ తనదైన మార్క్ తో కామెడీని కూడా పండించనున్నారు. రవితేజ తో చేసిన కృష్ణ,ఎన్టీఆర్ అదుర్స్ స్ధాయిలో కామిడీ కి స్ధానం కేటాయిస్తున్నారు.
దిల్ రాజు నిర్మించే ఎవడు చిత్రం విషయానికి వస్తే...అది పూర్తి యాక్షన్ చిత్రం. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాలతో పూర్తి స్ధాయి మాస్ హీరోగా తెలుగులో నిలబడాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. మరో ప్రక్క కొత్త చిత్రాలకు సంభందించి దర్శకులతో చర్చలు, స్టోరి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వివాహ సంబరాలుకు కొద్ది రోజులు మాత్రమే కేటాయిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











