twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ 'బలుపు' పరిస్ధితి అంత దారణమా?

    By Srikanya
    |

    హైదరాబాద్: రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బిజినెస్ సమస్యలు ఓ రేంజిలో ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    మొదట ఈ సినిమా చాలా బాగా వచ్చిందని ట్రైలర్ చూపించి బిజినెస్ చేద్దామనుకున్న నిర్మాత ఐడియా వర్కవుట్ కాలేదని, దాంతో సూప్ లో పడ్డారని చెప్పుకుంటున్నారు. మేలో విడుదల కావాల్సిన సినిమా దాంతో జూన్ కి వాయిదా పడింది. మరో ప్రక్క సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ సినిమాలు బోల్తా కొట్టడం కూడా దెబ్బకొట్టింది.

    దీనికి తోడు... రవితేజ వరస ఫ్లాపుల్లో ఉండటం కూడా ఈ సినిమా బిజినెస్ కు అడ్డంగా మారుతోంది. నిర్మాతలు అవుట్ రేట్ కు అమ్ముదామని ప్రయత్నం చేసినా ముందుకు రావటంలేదని చెప్తున్నారు. షేరింగ్, రిటర్నబుల్ అడ్వాన్స్ బేసిస్ లో సినిమాని తీసుకుంటామని చెప్తున్నారట.

    ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్‍‌తో సాగే ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత రవితేజ పూర్తి మాస్ రోల్ చేస్తున్నారు. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు.

    ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.

    English summary
    
 Rumors say that there is No buyers for raviteja's latest film balupu. The directed by Gopichand Malineni. The film is being produced by Prasad Vara Potluri under PVP Cinemas banner and stars Ravi Teja, Shruti Hassan and Anjali in lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X