బన్నీ కేసులో ట్విస్టు .. రేవతి భర్త కేసు వెనక్కి తీసుకున్నా కష్టమేనా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న సినిమా రిలేటెడ్ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించే అని చెప్పాలి. అల్లు అర్జున్ నటించిన తన తాజా చిత్రం పుష్ప 2 విడుదల సమయంలో చోటు చేసుకున్న ఇబ్బందులు .. అలాగే రిలీజ్‌కి ముందు రోజు ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన విషాద ఘటనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే ఈ దారుణ ఘటనలో ఒక్కో వెర్షన్ ఒక్కో రోజు బయటికి వస్తుంది. కానీ మొత్తంగా మాత్రం అల్లు అర్జున్‌నే ఒకింత ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్టుగా ఉందంటూ సినీ జనాలు చెవులు కోరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అనేది చాలా పెద్ద విషయంగా మారిపోయింది.

no chance for allu arjun in sandhya theater case

దీంతో అల్లు అర్జున్ పై ఆరోజు నుంచి ఇప్పుడు వరకు పలు షాకింగ్ వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఆయన సంధ్య థియేటర్ దగ్గరకి వెళ్లిన సమయంలో జరిగిన తొక్కిసలాట సమయంలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అలాగే ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లిపోవడం వంటి ఘటనలు ఊహించని విధంగా చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో చిక్కడపల్లి పోలీసులు ప్రధాన కారకులుగా థియేటర్ యాజమాన్యాన్ని పెడితే అల్లు అర్జున్ ని ఏ 11 గా చేర్చారు.

ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబం నుంచి , పుష్ప 2 నిర్మాణ సమస్య నుంచి మొత్తం 2 కోట్లకి పైగా ఆర్ధిక సాయాన్ని శ్రీతేజ్ కుటుంబానికి అందజేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యినరోజు రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని తనకు తెలియదని .. నా కొడుకు అల్లు అర్జున్ అభిమాని సినిమా చూస్తాను అంటే వెళ్లాం అని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ మీద కేసు ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అప్పుడే చెప్పారు.

no chance for allu arjun in sandhya theater case

అయితే అది మంచి విషయమే కానీ లేటెస్ట్ గా పోలీసు వారు ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రేవతి భర్త భాస్కర్ కేసు వెనక్కి తీసుకుందామన్నా అల్లు అర్జున్ విషయంలో చెయ్యడానికి ఏమీ లేదట. కేసు తీవ్రతని బట్టి మాత్రమే కేసు వెనక్కి తీసుకోవడం ఉంటుంది అని పోలీసులు చెబుతున్నారట.

కాగా ఇలాంటి ప్రమాద సమయాల్లో కేవలం చిన్న చిన్న గాయాలు ఫ్రాక్చర్స్ వంటివి జరిగి ఉంటేనే మళ్ళీ కేసు వెనక్కి తీసుకోవడం జరుగుతుందట. మరణం సంభవించినా, పరిస్థితి తీవ్రంగా ఉన్నా కూడా వెనక్కు తీసుకోవడం జరగని పని అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇది మాత్రం బన్నీ విషయంలో ఒక ఊహించని దెబ్బే అని చెప్పాలి. చూస్తుంటే అల్లు అర్జున్ మాత్రం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా లేదని చెప్పాలి. మరి ఈ ఉత్కంఠభరిత పరిస్థితులకి ఎలాంటి ముగింపు వస్తుందో ఏంటో అని అభిమానులు మరింత టెన్షన్ పడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X