బాలయ్య ‘సింహా’తో వెనుదిరిగిన ఆ ముగ్గురు!
'సింహా" చిత్ర ఘన విజయం బాలకృష్ణకు ఆరేళ్ల ఆకలిని తీర్చొచ్చు గాక, బోయపాటి శ్రీను ని 'టాలీవుడ్" మోస్ట్ వాటెండ్ డైరెక్టర్ గా నిలబెట్టొచ్చ గాక, నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి లాభాల పంట పండిస్తుండొచ్చు గాక. ఏది ఏమైననూ ఈ చిత్రం ఎన్ని'చిత్రాలు" చేస్తున్ననూ సంతృప్తి చెందని ముగ్గురు మనుషులు 'సింహా"కు సంబంధించి ఉన్నారు. అంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ఊరంతా దీపావళి జరుపుకుంటుంటే, కరెంట్ లేదని ఇంట్లో కూర్చుని సణిగే మనుషులెవరనేగా మీ సందేహం..? అది ఎవరో కాదు..'సింహా" చిత్రంలో నటించిన ముగ్గురు ముద్దుగుమ్మలు నమిత, స్నేహా ఉల్లాల్, నయనతార.
'సింహా" చిత్ర విజయానికి బాలయ్యని, బోయపాటిని మాత్రమే మెచ్చుకుంటున్నారు. వాళ్లిద్దరిని మాత్రమే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్రీన్ మీద నయనతార ఫెర్ఫామెన్స్ కి క్లాప్స్ కొట్టిన, నమిత బొద్దు అందాలు చూసి సొల్లు కార్చిన అది థియేటర్ వరకే పరిమితమైపోయాయి..మేము మాత్రం ఏం పాపం చేశాం, ఒక్కరు కూడా మా గురించి మాట్లాడుకోవట్లేదు అని కినుక వహించారు. ఆ ముగ్గురిలో నయనతార పరిస్థితి కొంచం పర్వాలేదనిపించినా. అడపా దడపా కొంత మంది కనీసం ఆమెనైనా మెచ్చుకుంటున్నారు. మిగిలిన ఇద్డరైతే మంచి బ్రేక్ కోసం తపించిపోతున్నారు.
కానీ ఏం చేస్తాం..ఇదిమగాళ్ల రాజ్యం అమ్మాయిలూ..!ఎన్ని బిల్లులు పాసైనా… మహిళలకి ఇక్కడ గుర్తింపు అంతంత మాత్రమే అని గుర్తెరిగి మసలుకుంటే ఇలాంటి 'అసంతృప్తి" సెగలు మిమ్మల్ని ఏం చేయవు… జానేదోభీ యార్… అంటూ ఆటోమేటిక్ గా మీరే సర్దుకుపోతారు. అర్ధమైందా….?


Click it and Unblock the Notifications











