Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ... అనుకున్న టైంకే చిచ్చా దిగుతుండు!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఇక ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందని తెలుస్తోంది. అయితే భగవంత్ కేసరి షూటింగ్ అప్డేట్స్ ఏంటి.. ఇంకా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయో.. ఎప్పటి వరకు ఈ సినిమా కంప్లీట్ అవుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాలయ్య సినిమా ఆగిపోయిందని.. అనుకున్న సమయానికి రావడం లేదంటూ వార్తలు వచ్చాయి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవల్మెంట్ వ్యవహారంలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కోర్టు బాబుకు 14 రోజుల రిమాండ్ విధించి... రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ బాధ్యతలు బాలయ్య మోస్తున్నాడు.

ఇక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాలయ్య బాబు అందులో బిజీ అయ్యారు. అంతే కాదు టీడీపీ బాధ్యతలు భూజాన మీద వేసుకుని మోస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా వాయిదా పడిదంటూ వార్తలు వచ్చాయి. అంతే కాదు 20శాతం మిగిలిఉందని.. ఆయన షూటింగ్ కు బ్రేక్ ఇవ్వడంతో.. ఈ సినిమా వాయిదా పడనుందని వార్తలు వచ్చాయి.
భగవంత్ కేసరి చిత్రాన్ని అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. అయితే అనుకున్న తేదీకే భగవంత్ కేసరి సినిమా రాబోతుందని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తోంది ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనులను సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ చేస్తున్నారు.

మొత్తంగా ముందు ప్రకటించిన విధంగానే భగవంత్ కేసరి మూవీ దసరా ముందు వీకెండ్ అయిన అక్టోబర్ 19న రిలీజ్ కానుందట. భగవంత్ కేసరి చిత్రం నుంచి గణేశ్ ఆంథం అనే తొలి పాట ఇటీవలే రిలీజ్ అయి ఆకట్టుకుంది. బాలకృష్ణ, శ్రీలీల స్పెప్పులు ఈ పాటలో హైలైట్‍గా ఉన్నాయి. భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.
భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురి పాత్రను శ్రీలీల చేస్తున్నారు. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 12కు ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని.. అక్టోబర్ 19న అనుకున్న టైంకే చిచ్చా దిగుతుండని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











