twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రంలో ఇదో విచిత్రం

    By Srikanya
    |

    సాధారణంగా ప్రేమ కథల్లో డ్యూయిట్స్ లేకుండా ఉండవు. కానీ రామ్ చరణ్ తేజ తాజా చిత్రం ఆరెంజ్ లో అలాంటి విచిత్రం జరగబోతోందని అంటున్నారు. తెలిసిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ తాజా చిత్రం ఆరెంజ్ లో తొమ్మిది పాటలు ఉన్నాయి..కానీ ఒక్క డ్యూయిట్ కూడా లేదు. హేరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కథ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఈ నెల 25న ఆడియో ఆవిష్కరణ జరగనుంది. బొమ్మరిల్లు బాస్కర్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేసింది.

    అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై నాగబాబు నిర్మిస్తున్న 'ఆరెంజ్‌' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా షాజన్‌ పదమ్ ‌సీ నటిస్తోంది. మగధీర వంటి ఘన విజయం సాధించిన చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటంపై ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే బొమ్మరిలు, పరుగు చిత్రాలతో భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని పేరు తెచ్చుకున్న భాస్కర్‌...చరణ్‌ తో ఓ సున్నితమైన ప్రేమకథగా 'ఆరంజ్‌'కు రూపకల్పన చేశారని చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సరసన జెనీలియా, షాజాన్‌ పదంసీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరంజీవి అభిమానుల సమక్షంలో సాగే ఆడియో వేడుకలో తెలుగు సినిమా ప్రముఖులు పాల్గొంటారు. 'ఆరెంజ్‌'లో ప్రకాష్‌ రాజ్‌, నాగబాబు, ప్రభు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌, సంచిత, పవిత్ర లోకేష్‌ తదితరులు నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌ రెడ్డి, సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, ఆర్ట్‌: ఆనందసాయి, స్టంట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంభాషణలు: తోట ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మన్యం

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X