చరణ్‌కు ఛార్టెడ్ ఫ్లైట్ గిఫ్టుపై ఉపాసన కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, ఉపాసన కామినేని నిశ్చితార్థం డిసెంబర్ 1న జరుగబోతోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని గొల్కొండ రిసార్ట్స్ లో ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ్యాప్తంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ షూటింగులో భాగంగా చైనాలో ఉన్నాడు. వారం రోజుల్లో ఆయన హైదరాబాద్ చేరుకోనున్నాడు.
కాగా....నిశ్చితార్థం రోజున చరణ్ కు అత్తింటి వారు కోట్ల విలువ చేసే చార్టెడ్ ప్లైట్ బహుమతిగా ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను చరణ్ గానీ, చిరు కుటుంబ సభ్యలు గానీ ఖండించక పోవడంతో నిజంగానే ఆ గిఫ్టు ఇస్తారేమో? అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఉపాసన మాత్రం ఈ వార్తలను ఖండిస్తోందట.
అదంతా వచ్చి అబద్ధం, చరణ్‌కు అటువంటి కానుక మా పేరెంట్స్ ఇవ్వడంలేదు. ఒకవేళ అలాంటివేమైనా ఇస్తామంటే తామిద్దరం కలిసి ఆ డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని చెపుతాం. అంతేతప్ప అలాంటి బహుమతులను రామ్ చరణ్ కానీ నేను కానీ స్వీకరించబోమని తన సన్నిహితులతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











