టాలీవుడ్ చరిత్రలో పవన్ సంచలనం: అవేమీ లేకుండానే సినిమా.. ఇది ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా!

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా దూసుకెళ్తోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో సత్తా చాటుతోన్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన పవన్.. ఇప్పటికే కొన్ని సినిమాలను కూడా ప్రకటించేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పవర్ స్టార్.. పాన్ ఇండియా డైరెక్టర్‌తో కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చంది. ఆ వివరాలు మీకోసం!

వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా

వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా

చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే 'వకీల్ సాబ్' అనే చిత్రంతో కమ్‌బ్యాక్ అయిన ఈ స్టార్ హీరో.. ఇది పట్టాలపై ఉండగానే పలు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'భీమ్లా నాయక్' అనే సినిమానూ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.

పవన్ దృష్టి అంతా దానిపైనే

పవన్ దృష్టి అంతా దానిపైనే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు చిత్రాలు ఓకే చేసినా 'హరిహర వీరమల్లు' మూవీ మీదనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రాబోతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేసుకుంటోన్నాడు.

సుజిత్‌తోనూ మూవీ ప్రకటన

సుజిత్‌తోనూ మూవీ ప్రకటన

'వకీల్ సాబ్' చేస్తోన్నప్పుడే పవన్ కల్యాణ్ ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో తనకు హరీశ్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది. అలాగే, వినోదయ సీతమ్ రీమేక్, సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే పవర్ స్టార్.. 'సాహో' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ సుజిత్‌తో సినిమాను ప్రకటించాడు.

RRR ప్రొడ్యూసర్.. ఆ స్టోరీతో

RRR ప్రొడ్యూసర్.. ఆ స్టోరీతో

టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించే సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇక, ఈ సినిమా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కుతోన్నట్లు కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.

డేట్ కూడా ఫిక్స్ చేసేశారు

డేట్ కూడా ఫిక్స్ చేసేశారు

సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించబోయే సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారో అన్న దానిపై అసలు క్లారిటీ రాలేదు. దీంతో దీనిపై ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. జనవరి 30వ తేదీన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారట. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు పవన్ సన్నిహితులు వస్తారని తెలిసింది.

హీరోయిన్ లేకుండా మూవీ

హీరోయిన్ లేకుండా మూవీ

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించే పాత్రే ఉండదట. అంటే.. ఇందులో హీరోయిన్ రోల్‌ను పెట్టడం లేదని తెలుస్తోంది. ఇలా గతంలో ఎప్పుడూ పవన్ కల్యాణ్ తనకు జోడీ లేని సినిమాను చేయకపోవడం విశేషం.

సాంగ్స్ కూడా లేకుండానే

సాంగ్స్ కూడా లేకుండానే

పవర్‌ఫుల్ కాంబినేషన్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో సాంగ్స్ కూడా ఉండవని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కానీ, పవన్ కల్యాణ్ పాత్రను ఎలివేట్ చేసే ర్యాప్ సాంగ్‌ తరహా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఉంటుందట. మొత్తానికి సాంగ్స్, హీరోయిన్‌ లేకుండా తొలిసారి ప్రయోగం చేస్తోన్నాడు పవన్ కల్యాణ్. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X