తొలిసారిగా హీరోయిన్ లేకుండా నాగార్జున
రొమాంటిక్ హీరోగా, మన్మధుడుగా తెలుగు తెరను ఏలుతున్న నాగార్జునకి తాజా చిత్రంలో హీరోయిన్ లేదు. గగనం టైటిల్ తో రాధా మోహన్ (ఆకాశమంతా ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథకు అడ్డమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో టెర్రరిస్టుగా మరో కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు నెలాఖరున రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ బాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ఇక ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ కులూ మనాలీలో, రెండో షెడ్యూల్ రామానాయుడు స్టూడియోస్ లో, మూడో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక ఎయిర్ పోర్ట్ సెట్ లో జరుగింది.
ఇక ఈ చిత్రం ఓ ధ్రిల్లర్ అనీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టేలా రూపొందిస్తున్నామని చెప్తున్నారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్లైట్ హైజాక్ అవటం అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. కొంతమంది టెర్రరిస్టులు హైజాక్ చేసి ప్రయాణీకులను పట్టుకుని జైలులో ఉన్న తమ నాయకుడిని విడుదల చేయమని కోరుతారు. అప్పుడు రంగంలోకి దిగిన ఓ పోలీస్ ఆఫీసర్ ఆ సమస్యను ఎలా పరిష్కరిచాడు అన్నదే కథనం. నాగార్జున ఇది ఒక వెరైటీ చిత్రంగా భావించి చేస్తున్నారు. ఆయన ఎంతో ఎక్సపెక్ట్ చేస్తూ చేసిన కేడీ చిత్రం ఫెయిల్యూర్ కావటంతో దీనిపైనే పూర్తి దృష్టి పెట్టారు.


Click it and Unblock the Notifications











