twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సన్నీ లియోన్‌ సినిమా నుండి హీరో రానా బయటకు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌తో కలిసి నటించడానికి రానా సుముఖత చూపడం లేదా? కావాలనే ఆమె సినిమా నుండి తప్పుకున్నాడా? అంటే అవుననే వాదన వినిపిస్తోంది. శృంగార సన్నీ లియోన్ ప్రధాన పాత్రధారిగా రూపొందే 'వన్ నైట్ స్టాండ్' హిందీ సినిమాలో రానా కీలక పాత్రకు ఎంపిక చేసారు.

    కథ నచ్చి తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా...ఎందుకనో రానా మనసు మార్చుకున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి జాస్మిన్ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. "రానాకు ఈ కథ బాగా నచ్చింది. తప్పకుండా చేస్తానని చెప్పాడు. కానీ, బల్క్ డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. అయితే, అతను చేసేదీ లేనిదీ ఇంకా ఇదమిత్థంగా తెలియదు " అంటున్నాడు దర్శకుడు. మరి రానా డేట్స్ లేక నటించలేక పోతున్నాడా? ఈ శృంగార తారతో నటించడం ఇష్టం లేకనా? అనేది తేలాల్సి ఉంది.

    No 'One Night Stand' for Rana Daggubati

    కాగా...ప్రస్తుతం రానా రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ‘బాహుబలి' షూటింగ్ పూర్తయిన తర్వాత వానిటీ రూంకు వెళ్ళే సమయంలో రానా తల రూం డోర్ కు గట్టిగా తగిలింది. రానా బాగా పొడవు కావడం వలన ఈ సంఘటన జరిగింది. దాంతో చిన్న గాయమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో రానా తెలియచేసారు. ‘కొన్నిసార్లు జైంట్ పర్సనాలిటీ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు' అంటూ తన హైట్ మీద ట్విట్టర్ లో జోక్ వేసుకున్నాడు.

    అలాగే ఈ విషయం తెలియచేస్తూ...‘భారి యాక్షన్ సినిమాలలో నటించే సమయంలో గాయాలు(ఇంజురీ) కావడం సహజం అని నేను అనుకుంటున్నాను, ఆన్ లొకేషన్ (సెట్స్)లో అయినా కావొచ్చు, బయట అయినా కావొచ్చు' అన్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.

    English summary
    South star Rana Daggubati is believed to have pulled out of 'One Night Stand' due to prior commitments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X