బాలయ్య సంచలన నిర్ణయం: కెరీర్‌లో తొలిసారి అవి లేకుండా సినిమా.. ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా?

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభంలో ఫ్యామిలీ మూవీస్ చేసినప్పటికీ.. ఎక్కువ శాతం పక్కా మాస్ సినిమాలనే చేశారాయన. అందుకే టాలీవుడ్‌లోని చాలా తక్కువ మంది మాస్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. పవర్‌ఫుల్ సీన్స్‌లో బాలయ్య నట విశ్వరూపం చూపిస్తాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు, డైలాగ్ డెలివరీలోనూ ఆయనను మించిన వాళ్లు లేరు. అలాంటి ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ఫైట్స్, డైలాగులు లేవట. ఆ వివరాలు మీకోసం.!

బాలయ్యకు అస్సలు కలిసి రాలేదు

బాలయ్యకు అస్సలు కలిసి రాలేదు

2019వ సంవత్సరం నందమూరి బాలకృష్ణకు అస్సలు కలిసి రాలేదు. దీనికి కారణం గత ఏడాది ఆయన నటించిన మూడు సినిమాలు విడుదలవగా.. అన్నీ పరాజయం పాలయ్యాయి. వీటిలో కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ‘రూలర్'తో నటుడిగా.. క్రిష్ జాగర్లమూడి తీసిన యన్.టి.ఆర్ బయోపిక్ రెండు భాగాలతో నిర్మాతగానూ ఆయన నష్టపోయాడు.

హ్యాట్రిక్ కొట్టేందుకు ఆయనతో జత

హ్యాట్రిక్ కొట్టేందుకు ఆయనతో జత

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న బాలయ్య... ఈ సారి ఎలాగైన సూపర్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం తనకు గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి బంపర్ హిట్లను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఇది రూపొందుతోంది.

 ఎన్నో ఆటంకాలు.. సినిమా ఆలస్యం

ఎన్నో ఆటంకాలు.. సినిమా ఆలస్యం

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కథలో మార్పులు చేయాల్సి రావడం కారణంగా ఆలస్యం అయింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం జరగడం సహా పలు అనివార్య కారణాల వల్ల రెగ్యూలర్ షూటింగ్ మొదలు కాలేదు. ఇప్పుడు మొదటి షెడ్యూల్ పూర్తవగానే కరోనా వల్ల బ్రేక్ వచ్చింది.

ఎంతో మంది అనుకుంటే ఫైనల్ కాలేదు

ఎంతో మంది అనుకుంటే ఫైనల్ కాలేదు

హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడినప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అదే సమయంలో ఈ సినిమా కథ, హీరోయిన్ ఎంపిక, బాలయ్య రోల్స్, ఇతర నటీనటుల గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అలాగే హీరోయిన్ విషయంలోనూ పలు పేర్లు చర్చకు వచ్చినప్పటికీ.. ఇంత వరకూ క్లారిటీ రావడం లేదు.

బాలయ్య సినిమాలో నో ఫైట్స్.. నో డైలాగ్స్

బాలయ్య సినిమాలో నో ఫైట్స్.. నో డైలాగ్స్

ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తాడట. అందులో ఒకటి అఘోరా పాత్ర అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ పాత్రకు ఎటువంటి డైలాగులు కానీ, ఫైట్స్ కానీ ఉండవనేదే తాజా న్యూస్ సారాంశం. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

Recommended Video

Tollywood And Bollywood Celebrities Participated in Modi's 9 PM 9 Baje Light Lamps event
కెరీర్‌లో తొలిసారి అవి లేకుండా సినిమా.!

కెరీర్‌లో తొలిసారి అవి లేకుండా సినిమా.!

నటసింహా బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయంతో పాటు త్రిపాత్రాభినయం కూడా చేశారు. అయినప్పటికీ.. అన్ని పాత్రలకూ డైలాగ్స్, ఫైట్స్ ఉండేలా చూసుకున్నారు. అయితే, బోయపాటితో చేసే సినిమాలో మాత్రం అఘోరా పాత్ర సైలెంట్‌గా ఉంటూనే ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమా మొత్తం నడుస్తుందని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X