»   » నితిన్ సినిమాలో పవన్ టాపిక్ కి చెక్

నితిన్ సినిమాలో పవన్ టాపిక్ కి చెక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరసగా నితిన్ సినిమాల్లో పవన్ టాపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇష్క్ ఆడియో రిలీజ్ కు పవన్ కల్యాణ్ రావటం,సినిమా సూపర్ హిట్ అవటం....ఆ తర్వాత వచ్చిన గుండె జారి గల్లంతైంది చిత్రంలోనూ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేయటం,ఖుషిలో బొడ్డు సీన్ ని రిపీట్ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు కొరియర్ బాయ్ కళ్యాణ్ అంటూ పవన్ కల్యాణ్ పేరు ని తన చిత్రంలో టైటిల్ కే పెట్టుకున్నాడు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్...ని తన సినిమల్లో ఎక్కడో చోట నితిన్ పెడతాడనే విషయం అందరికీ స్పష్టం అయ్యింది. అయితే ఇప్పుడు దానికి చెక్ పడనుందని తెలుస్తోంది.

పూరి జగన్నాథ్, యంగ్ హీరో హీరో నితిన్ కాంబినేషన్లో 'హార్ట్ ఎటాక్' రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మీద డైలాగులు వచ్చేటట్లు చూడమని నితిన్ కోరాడని,పూరి దాన్ని సున్నితంగా తిరస్కరించాడని టాక్. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్‌తో ఇక సినిమా చేయను అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ చేసిన కామెంట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. అసలు ఆయన ఇలా ఎందుకు అన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అంతకు ముందు రోజే పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. 'ఇద్దరమ్మాయిలో' చిత్రంలో 'ప్రతి ఎదవా పవన్ కళ్యాన్ ఫ్యానే' అనే డైలాగే అందుకు కారణం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పూరి జగన్ తిరస్కరించాడని తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ వైష్ణో అకాడమీ బ్యనర్‌పై ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పూరితో పని చేసే అవకాశం రావడంపై నితిన్ స్పందిస్తూ...'పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మంచి సినిమా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరుతోంది. పూరి గారు చెప్పిన సబ్జెక్టు వినగానే ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ చేద్దామా అని ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది' అని తెలిపారు.

ఆగస్టు 15 నుంచి నాన్ స్టాప్‌గా యూరఫ్, గోవాలలో జరిగే భారీ షెడ్యూల్స్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. నితిన్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయి నితిన్ ని చాలా పెద్ద రేంజికి తీసుకెళ్లే సినిమాగా పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని చాలా పెద్ద లెవల్‌లో తీస్తున్నారు. నితిన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ఈచిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం : పూరి జగన్నాథ్.

English summary
Young hero Nitin and maverick director Puri Jagannath next film ‘Heart Attack’ will start rolling from August 30th. Pre-production work has been going on for quite sometime.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu