Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటి కూడా లేదట
కొంత కాలంగా తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియా వ్యాప్తంగా సినీ ప్రియులంతా వేచి చూస్తోన్న సినిమాల్లో 'సలార్' ఒకటన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ చిత్రం ఆరంభం నుంచే హైప్‌ను క్రియేట్ చేసుకుంది. దీనికి కారణం ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తుండడమే అని తెలిసిందే.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీకి సంబంధించిన షూటింగ్ రెండేళ్ల క్రితమే ప్రారంభం అయింది. మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా కొద్ది రోజుల క్రితమే దీన్ని పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా మొదలు పెట్టారు. ఇందులో మంచి ఔట్‌పుట్ ఇవ్వడం కోసం సినిమాను ఒకసారి వాయిదా కూడా వేసేశారు.

'సలార్' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అందులో మొదటి పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' పేరిట డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సలార్' మూవీని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు చిత్ర యూనిట్ ఎన్నో ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 2వ వారంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్రాండ్ ఈవెంట్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
'సలార్' మూవీ ఈవెంట్‌కు సంబంధించి తాజాగా ఓ మైండ్ బ్లాకయ్యే న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేయడం లేదట. కానీ, దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూలను మాత్రం నిర్వహించబోతున్నట్లు తెలిసింది. ఇది ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూసే అని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











