twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబ్బే...త్రిష పై వచ్చింది రూమరే నట

    By Srikanya
    |

    హైదరాబాద్: ఫలానా హీరో లేదా హీరోయిన్ సినిమాలో నటిస్తోందంటూ మీడియాలో గుప్పు మనటం ఆ వెనువెంటనే నేను నటించటం లేదు బాబోయ్ అంటూ సదరు వ్యక్తులు ఖండనలు ఇవ్వటం కామన్ అయిపోయింది. తాజాగా త్రిష పై సైతం ఇలాంటి ఓ న్యూస్ ఒకటి మీడియాలో హల్ చల్ చేసింది. ఆమె కన్నడ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాను చేయటం లేదంటూ ఖండించింది. ఇంతకీ ఏంటా సినిమా అంటే..

    రీసెంట్ గా కన్నడంలో రీమేక్ అవుతున్న అత్తారింటికి దారేది చిత్రంలో త్రిష నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఆమె స్పెషల్ సాంగ్ చేస్తోందని అన్నారు. తెలుగులో ముంతాజ్, హంసా నందిన చేసిన సాంగ్ కు ఆమె స్టెప్స్ వేస్తోందని అన్నారు. అందులోనూ ఆమె రీసెంట్ గా కన్నడంలో పవర్ చిత్రంలో ఎంట్రీ ఇవ్వటంతో అంతా అది నిజమే అని నమ్మారు. అయితే త్రిష తల్లి ఆ వార్తలను ఖండించింది. తమ వద్దకు అలాంటి ప్రపోజల్ ఏమీ రాలేదని, ఆ చిత్రం యూనిట్ వారు ఎవరూ కలవలేదని అంది.

    అయితే త్రిష చేస్తోంది తమిళంలో అని చెప్తున్నారు. అక్కడ కూడా ఆమె చేసేది ఐటం సాంగ్ కాదు కేవలం ఓ స్పెషల్ సాంగ్ అంటున్నాయి ఆ సినిమా యూనిట్ వారు. ఏది ఎలా ఉన్నా త్రిష తన అభిమానులకు ఆనందం కలిగించేలా స్పెషల్ లేదా ఐటం సాంగ్ చేస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు..అజిత్ తో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం అనుష్క హీరోయిన్ కావటం విశేషం. ఈ విషయాన్ని తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ తెలియచేసారు.

    No role for Trisha in 's Kannada Attarintiki Daredi Movie

    'తల' అజిత్‌ 55వ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆ సినిమాకు పేరుపెట్టకపోయినా.. 'తల - 55' పేరుతో ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లు నగరంలో భారీగా దర్శనమిస్తున్నాయి. గౌతంమీనన్‌ దర్శకత్వంలోని ఈ సినిమాలో అనుష్క కథానాయిక. త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇందులో ఆమె ఓ ప్రత్యేక గీతంలో చిందులేసినట్లు సమాచారం.

    గౌతంమీనన్‌ దర్శకత్వంలో 'కాక్క కాక్క' వంటి పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అజిత్‌ నటించలేదు. చాలా కాలం తర్వాత వారి కాంబినేషన్లో యాక్షన్‌ కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. అజిత్‌ పోలీసు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ డాన్‌ మెక్కాతర్‌ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు.

    షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. క్లెమాక్స్‌ సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని ప్యాచ్‌ సన్నివేశాలే ఉన్నాయి. ఈ నెలాఖరులో సినిమా పేరు ప్రకటించి.. ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రిస్మస్‌ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Trisha's Mom Uma Krishnan condemns reports of anyone from 'Ranna' team approaching them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X