RRR: తెలంగాణ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. విడుదలకు ముందుకు షోలకు బ్రేకులు?
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. 2018 లో ప్రకటించిన ఈ సినిమా ఎట్టకేలకు 2022 మార్చి 25వ తేదీన విడుదల కావడానికి సర్వం సిద్ధమైంది. మరి కొద్ది గంటలలో అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు బెనిఫిట్ షోలు పడతాయని అందరూ భావించారు. అయితే ఇప్పుడు బెనిఫిట్ షోలు పడతాయా లేదా అనేదానిమీద కన్ఫ్యూజన్ నెలకొంది. ఆ వివరాలు

ప్రతిష్టాత్మక RRR
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా వారి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. సినిమా మొదటి నుంచి కూడా భారీ ఎత్తున భారీ బడ్జెట్తో నేర్పించాలని భావిస్తూ రావడంతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.. అందుకే పాన్ ఇండియా స్థాయిలో నటీనటులను ఈ సినిమాలో భాగం చేశారు. అలా ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ శరణ్ వంటి వాళ్లు కూడా నటించారు.

మార్చి 25 వ తేదీన
ఈ సినిమా ప్రారంభించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకు రెట్టింపు చేస్తూ వెళ్ళాయి. అలా అనేక సార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు మార్చి 25 వ తేదీన విడుదలకు సిద్ధమైంది. అయితే తెలంగాణలో బెనిఫిట్ షోల విషయంలో ఫ్యాన్స్ కి షాక్ తగిలే అవకాశం ఉందని అంటున్నారు.

ఆరు థియేటర్లలో
నిజానికి ఈ సినిమా ఆరు థియేటర్లలో బెనిఫిట్ షో వేయాలని ముందు నిజాం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు దగ్గర ఒక సినీ నిర్మాత పర్మిషన్ తెచ్చుకున్నారు. అజిత్ వలిమై సినిమాని తెలుగులో విడుదల చేసిన గోపీచంద్ ఇన్నామూరి అనే నిర్మాత హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఉన్న భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, మూసాపేట్ లో ఉన్న శ్రీ రాములు థియేటర్, బోరబండలో ఉన్న విజేత థియేటర్లో సినిమా బెనిఫిట్ షో ప్రదర్శిస్తామని దానికి పర్మిషన్ ఇవ్వాలని పోలీసు కమిషనర్ కు లేఖ కూడా రాశారు.

5 గంటల తరువాతే
ఈ ఆరు షో లు మాత్రమే కాకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా కొన్ని బెనిఫిట్ షోలు పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని అనివార్య కారణాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి మిడ్నైట్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. తెల్లవారుజామున 5 గంటల తరువాతే సినిమా వేసుకునే అవకాశం కల్పించేందుకు దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

పోలీస్ పర్మిషన్ వచ్చిందని
అయితే మరోపక్క సైబరాబాద్ పరిధిలో ఉన్న భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాధ్, అర్జున్ థియేటర్లకు పోలీస్ పర్మిషన్ వచ్చిందని టికెట్లు కూడా పెద్ద ఎత్తున అమ్ముడు పోవడంతో అక్కడ మాత్రం సినిమా పడే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ షోలు పడే దాకా పడ్డాయా ? లేదా? అనే విషయం మీద క్లారిటీ లేదు. మరి చూడాలి ఏం జరగబోతోంది.


Click it and Unblock the Notifications











