'బాహుబలి' ఆడియో పంక్షన్ :ఫ్యాన్స్ కు నిరాశ
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'బాహుబలి'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. అనుష్క, తమన్నా కథానాయికలు. రానా కీలక పాత్ర పోషించారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు శనివారం తిరుపతిలో విడుదలయ్యాయి. ఈ చిత్రం ఆడియో పంక్షన్ లో ...అంతా ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్ ని విడుదల చేస్తారని ఆశించారు. ఎందుకంటే రెగ్యులర్ గా...చిత్రం ఆడియో విడుదలైనప్పుడు... ట్రైలర్స్ విడుదల చేస్తూంటారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రం ఆడియో సమయంలో అంతా కొత్త ట్రైలర్ వస్తుందని కళ్లు కాయలు కాసేలా చూసారు. కానీ ... ఫ లితం లేదు. సెకండ్ ట్రైలర్ ని సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ చేస్తారని చెప్పారు. ఈ పంక్షన్ లో చేయలేదు. దాంతో ఫ్యాన్స్ నిరాసపడ్డారు.

ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











