For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'నాన్నకు ప్రేమతో' కు షాక్ : ఎపి లో తీసుకునేవాళ్లు లేరా?

  By Srikanya
  |

  హైదరాబాద్‌: సుకుమార్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయటానికి ఓ ప్రక్కన సన్నాహాలు జరుగుతున్నాయి. అదే ఊపులో బిజినెస్ కూడా మొదలెట్టారు. అయితే ట్రేడ్ వర్గాల్లో చెప్పుకునేదాన్ని బట్టి ఎపి నుంచి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ఉత్సాహంగా సినిమాని తీసుకోవటానికి రావటం లేదని చెప్తున్నారు.

  దానికి కారణం..డిక్టేటర్ మీద ఈ చిత్రం వేయటం ఒక కారణమైతే మరొకటి...ఎన్టీఆర్ కు టీడీపి మధ్య రిలేషన్స్ సరిగ్గా లేకపోవటంతో అది కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతుందనే టాక్ అని చెప్తున్నారు. దాంతో నిర్మాతలు చెప్తున్న రేటుకు ఎవరూ ముందుకు రావటం లేదు అంటున్నారు. ఈ చిత్రం నైజాం రైట్స్ ని రిలియన్స్ వారు తీసుకున్నారు. వారే ఈ సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నారు.

  ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'.

  No Takers For NTR's Nannaku Prematho in AP?

  మరో ప్రక్క ఈ చిత్రం ఆడియోని డిసెంబర్ 20 న లేదా 23న గాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా యుకె లో 90 రోజుల పాటు కంటిన్యూ గా షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్రం సంక్రాంతికు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.,

  నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ,'విజయదశమి కానుకగా విడుదలైన 'నాన్నకు ప్రేమతో..' టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌ను రిలీజ్‌ చేశాం. లండన్‌లో 60 రోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతోంది. నవంబర్‌ 19 నుంచి స్పెయిన్‌లో 20 రోజులపాటు చివరి షెడ్యూల్‌ను చేయబోతున్నాం. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు.

  ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు ప్రేక్షకుల తరఫున విశేష స్పందన రావడంపై ఎన్టీఆర్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా స్పందించారు. టీజర్‌ను 20 లక్షల మంది వీక్షించడం, 39 వేల లైక్స్‌ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. అభిమానుల నుంచి లభించిన ఈ అనూహ్య స్పందన మొత్తం చిత్ర బృందానికి పెద్ద శక్తిని అందించిందంటూ పోస్ట్‌ చేశారు.

  No Takers For NTR's Nannaku Prematho in AP?

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

  ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

  English summary
  Exact reasons are not known, many opine that not many distributors are ready to pump in money on Nannaku Prematho in AP.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X