చిరంజీవికి రొమాన్స్ కట్.. అలాంటి సీన్స్‌తో ప్లానింగ్‌లో అనిల్ రావిపూడి!

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యువ జెనరేషన్ స్టార్స్ అంతా ఓ రేంజ్ లో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ లు షేక్ చేస్తున్నారు. అయితే ఈ యువ హీరోస్ కూడా పోటీ వారిని మించి మార్కెట్ ని తెలుగు స్టేట్స్ లో సొంతం చేసుకున్న సీనియర్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. కాగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్నారు.

కాగా తనతో పాటుగా ఇతర కో స్టార్స్ సీనియర్ హీరోస్ ఉన్నప్పటికీ వారిలో మెగాస్టార్ రేంజ్ ఓపెనింగ్స్ అంటే కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. కాగా వీటికి మించి చిరంజీవిపై కొన్ని విమర్శలు కూడా లేకపోలేవు. తన ఏజ్ ఉన్న హీరోస్ ఇపుడు తమ ఏజ్ కి తగ్గ పాత్రలే చేస్తున్నారని చెప్పాలి.

no this kind of scenes in chiranjeevi anil ravipudi project

కాగా వారి విషయంలో ఇంకోపక్క తమిళ సీనియర్ స్టార్స్ పరంగా చూసుకున్నా కూడా చిరు ఇంకా యంగ్ హీరో అనుకుంటున్నారా ఇంకా హీరోయిన్స్ తో రొమాన్స్ లు రొమాంటిక్ సీన్స్, పాటలు ఏంటి అనే విమర్శలు చాలా వచ్చాయి. కాగా వీటిని ఇపుడు చిరు విషయంలో దర్శకులు సహా చిరు కూడా సీరియస్ గానే తీసుకున్నారు.

కాగా ఇవి మాత్రమే కాకుండా రీమేక్ సినిమాలు పరంగా కూడా చిరంజీవిపై వచ్చిన విమర్శలతో ఇక నుంచి స్ట్రైట్ సినిమాలు మాత్రమే తాను చేస్తున్నారు. కాగా వీటిలో చాలా కాంప్రమైజ్ అయ్యే ఎలిమెంట్స్ ని పెట్టనున్నారట. విశ్వంభర సంగతి ఏమో కానీ నెక్స్ట్ చిరు చేస్తున్న సినిమాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

కాగా అనీల్ రావిపూడి ఈ చిత్రంలో మెగాస్టార్ పై ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు కానీ ఓవర్ రొమాంటిక్ డ్యూయెట్స్ కానీ పెట్టబోవడం లేదట. ఈ విమర్శలు దృష్టిలో పెట్టుకొనే తాను పలు సన్నివేశాలు పక్కా ప్లానింగ్ గా డిజైన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కేవలం మెగాస్టార్ పై ఎలివేషన్స్ సాలిడ్ మ్యానిరజం లు మాత్రమే తాను ట్రై చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

సో ఈసారి మెగాస్టార్ విషయంలో అలాంటి విమర్శలకి ఎలాంటి తావు ఉండకపోవచ్చని చెప్పక తప్పదు. కానీ చిరు నుంచి మరీ మూసగా అంటే ఫ్యాన్స్ కి కూడా నచ్చకపోవచ్చు. హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ లేకపోయినా చిరంజీవి కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోతోంది. వీటిని కూడా అనీల్ కట్ చేస్తారా లేదా ఉంచుతారా అనేది మంచి ప్రశ్నగా మారింది.

సో వీటి విషయంలో క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో అనీల్ రావిపూడి బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది అయ్యాక ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాదిలోనే ముగించేసే సన్నాహాలు చేస్తున్నారట. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని నిలపాలని ప్లాన్ చేస్తున్నారట.

More from Filmibeat

Read more about: chiranjeevi anil ravipudi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X