'దూకుడు' రికార్డుల గొడవకు మూల కారణం?
దూకుడు యాభై రోజుల ఫంక్షన్ జరిగిన నాటినుంచీ ఈ చిత్రంపై రికార్డుల గొడవలు ప్రారంభమయ్యాయి. మెగాభిమానులు తమ మగధీర రికార్డును ఎవరూ బ్రద్దలు కొట్టలేరని, దూకుడువి ఫేక్ రికార్డులని వారు లక్ష రూపాయలు రివార్డు ప్రకటించి మరీ ఛాలెంజ్ విసిరారు. దానికి ప్రతి సవాల్ గా మహేష్ అబిమానులు తమ దూకుడువి ఫేక్ రికార్డులు అని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అస్సలు ఇంత గొడవ రావటానికి మూల కారణం.. దూకుడు నిర్మాతలు తాము కలెక్షన్స్ లో పారదర్శకత లేకపోవటమేనని విశ్లేషకులు అంటున్నారు. దూకుడు రికార్డులని చెప్తున్న కలెక్షన్స్ ని ఏరియాల వారిగా ధియోటర్స్ తో సహా లెక్కలు ప్రకటిస్తే అస్సలు ఈ గొడవ ఇంతవరకూ వచ్చేది కాదని అంటున్నారు.
అప్పుడు మగధీర ది దూకుడు క్రాస్ చేసిందో లేదో కరెక్టుగా తేలిపోయేదని చెప్తున్నారు. అయితే ఈ రికార్డుల గొడవను కూడా నిర్మాతలు తమ చిత్రానికి పబ్లిసిటీగా భావిస్తున్నారా అనేది కొందరు లేవనెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే మీడియాలో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ ఈ రికార్డుల గొడవే గత కొద్ది రోజులుగా హైలెట్ అయ్యి కూర్చుంది. ఇప్పటికైనా ఛాలెంజ్ లు ఒకరి కొకరు చేసుకోవటం మాని దూకుడు నిర్మాతలు తాము చెప్పే రికార్డులకు చెందిన లెక్కలు ఇవీ అని ప్రకటిస్తే బెస్ట్ అంటున్నారు. మరి వారు ఏమి ఆలోచిస్తున్నారో చూడాలి.


Click it and Unblock the Notifications











