దూకుడు వల్ల వాళ్లకేమీ లాభం లేదు
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు వల్ల నిర్మాతలు,ఎగ్జిబిటిర్స్ కలెక్షన్స్ పరంగా బాగా లాభపడిన సంగతి తెలిసిందే. అయితే అందులో నటించిన మహేష్ కు ప్రత్యేకంగా వచ్చినంతగా మైలేజి సమంతకు,పార్వతీ మిల్టన్ కు లేదంటున్నారు. ఎందుకంటే సమంత ఒప్పుకుని చేస్తున్న ఈగ,గౌతమ్ మీనన్ చిత్రం,రామ్ చరణ్ ఎవడు,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలన్నీ దూకుడు జరుగుతున్నప్పుడు ఓకే చేసినవే. దాంతో దూకుడు వందరోజులుకు దగ్గరపడుతున్నా ఆమెకు కలిసివచ్చిన లాభమేమి లేదంటున్నారు. దానికి కారణం ఆమె చిత్ర విజయం లో భాగస్వామిగా మారింది కానీ,ఆమె వల్లే విజయం సిద్దించకపోవటం కూడా కావచ్చునని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రంమీద ఆశ పెట్టుకున్న మరో ముద్దు గుమ్మ పార్వతి మిల్టన్. ఆమె ఈ చిత్రంలో చేసిన ఐటమ్ సాంగ్ తో ఆమెకు కెరీర్ పుంజుకుని మెయిన్ స్ట్రీమ్ లో ఆఫర్స్ వస్తాయని భావించింది. అయితే ఆమెకు కూడా కలివి వచ్చిందేమీ లేదు. కేవలం గబ్బర్ సింగ్ లో మరో ఐటమ్ సాంగ్ కి ఆమెను పరిశీలుస్తున్నారు. దాంతో ఆమె కూడా ఈ చిత్రంతో లబ్ది పొందుదామనుకుని నీరసపడింది. మహేష్ కు ఈ చిత్రం హిట్టవటం వల్ల తన స్టామినా ఏంటనేది ప్రపంచానికి మరో సారి రుజువుచేసినట్లైంది. అలాగే ఈ చిత్రంతో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరోగా మహేష్ మారారు. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల బిజీ కమర్షియల్ డైరక్టర్ గా మారారు.


Click it and Unblock the Notifications











