చిరంజీవి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: విలన్, ఫైట్లు లేకుండానే మూవీ.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాశారే!

సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ రాకెట్ వేగంతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలతో ప్రేక్షకులకు, అభిమానులకు మజాను అందించిన ఆయన.. గత సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నారు.

ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఆయన చేయబోయే కొత్త సినిమా గురించి షాకింగ్ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

No Villain and Fights in Chiranjeevi and Kalyan Krishna Movie

'భోళా శంకర్‌'తో రెడీగానే: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్టు 11న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీని నుంచి టీజర్‌ను వదిలారు.

No Villain and Fights in Chiranjeevi and Kalyan Krishna Movie

ఆ డైరెక్టర్‌తో అనుకున్నా: రీఎంట్రీలో చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టుల కోసం కథలను వింటున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది యంగ్ అండ్ సీనియర్ డైరెక్టర్లతో చిరు కథాపరమైన చర్చలు జరిపారు. ముఖ్యంగా వెంకీ కుడుముల, గోపీచంద్, వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్ వంటి వాళ్లతో సినిమాలు చేయాలని అనుకున్నా వర్కౌట్ కాలేదు.

No Villain and Fights in Chiranjeevi and Kalyan Krishna Movie

బంగార్రాజు డైరెక్టర్‌తో సై: ఏజ్ అసలు మేటర్ కాదన్నట్లుగా ఏకధాటిగా సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే 'బంగార్రాజు' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో ఓ ప్రాజెక్టు చేసేందుకు సిగ్నల్ ఇచ్చారు. దీన్ని సుస్మిత కొణిదెల నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని అంటున్నారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట.

No Villain and Fights in Chiranjeevi and Kalyan Krishna Movie

మల్టీస్టారర్‌గానే వస్తుంది: 'భోళా శంకర్' తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ఇక, ఈ సినిమాలో మరో హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో అతడికి జోడీగా శ్రీలీల ఎంపికైనట్లు తెలిసింది. ఈ చిత్రం ఆగస్టు 22న ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందట.

విలన్, ఫైట్స్ లేకుండానే: కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో విలన్ కానీ, ఫైట్లు కానీ ఉండవట. కేవలం ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

No Villain and Fights in Chiranjeevi and Kalyan Krishna Movie

అసలు ట్విస్ట్ అదేనంటూ: చిరంజీవి - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చే సినిమా.. మలయాళంలో వచ్చిన 'బ్రో డాడీ'కి రీమేక్‌గా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ, బెజవాడ ప్రసన్న కుమార్ రాసిన కొత్త కథతోనే ఈ చిత్రం తెరకెక్కుతుందని మరో వార్త వైరల్ అయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 'బ్రో డాడీ'కి రీమేక్‌గానే వస్తుందట. అందుకే ఇందులో ఫైట్లు, విలన్ ఉండడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X