అలా విడాకులు అయ్యాయో లేదో.. మళ్లీ పెళ్లికి రెడీ!.. నోయల్ పోస్ట్ అర్థం అదేనా?

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో సింగర్ నోయల్, హీరోయిన్ ఏస్తర్ విడాకులే వైరల్ అవుతున్నాయి. ఎంతో కాలం నుంచి ప్రేమించుకున్న ఈ జంట గతేడాది జనవరిలో వివాహా బంధంతో ఒక్కటైంది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయట. విడాకుల కోసం దరఖాస్తు చేసి కూడా ఏడాదికి పైనే అవుతోందని చెప్పుకొచ్చారు. ఇక విడాకులపై కోర్టు అధికారిక తీర్పు ఇవ్వడంతో వీరు కూడా సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని ప్రకటించారు.

 నోయల్ స్పందన..

నోయల్ స్పందన..

మాకు అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. ఎన్నో రోజుల తరువాత మౌనం వీడుతున్నాము. నాకు ఏస్తర్‌తోకు విడాకులు అయ్యాయని ప్రకటిస్తున్నాను. ఈ విషయాన్ని కోర్టు అధికారికంగా ప్రకటించిన తరువాతే పబ్లిక్‌గా చెప్పాలని ఇన్ని రోజులు ఎదురుచూశాను అని నోయల్ విడాకులపై సెన్సేషనల్ పోస్ట్ చేశాడు.

 ఆమె కలలన్నీ నిజం కావాలి..

ఆమె కలలన్నీ నిజం కావాలి..

అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ అందమైన బంధం విలువను కాపాడేందుకు మేము ఇలా విడిపోయాం. ఈస్తర్‌కు మంచి జరగాలి.. ఆమె కన్న కలలన్నీ నిజం కావాలి. అంతా మంచే జరగాలి. అంటూ నోయల్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది.

 విడాకులపై ఏస్తర్ పోస్ట్..

విడాకులపై ఏస్తర్ పోస్ట్..

ఇంకో వైపు ఏస్తర్ కూడా విడాకులు మంజూరు కావడంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటించడానికి దాదాపు ఏడాదికి పైగా ఎదురుచూస్తున్నాను. చట్టబద్ధంగా, అధికారికంగా నిర్ణయించిన తరువాతే చెబుదామని ఊరుకున్నాను. అంటూ కోర్టు ఆర్డర్స్ వచ్చాయని ఏస్తర్ ప్రకటించింది.

ఎప్పుడో విడిపోయాం..

ఎప్పుడో విడిపోయాం..

నోయెల్, నేను 2019 జనవరి 3 వ తేదీన వివాహం చేసుకున్నాము. మాకు పెళ్లైన కొద్ది రోజుల్లోకే మనస్పర్దలు వచ్చాయి. గత ఏడాది జూన్‌లో మ్యూచువల్ డైవర్స్ కోసం పిటీషన్ దాఖలు చేశాము. కోర్టు విడాకులు మంజూరు చేసిన తరువాతే బయటకు చెప్పాలని ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నాము. అంటూ ఏస్తర్ విడాకుల విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది.

Recommended Video

Valayam Teaser Out | Laksh Chadalavada | Digangana
 కొత్త ఆరంభం..

కొత్త ఆరంభం..

తాజాగా నోయల్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రెండ్రోజుల క్రితం విడాకులపై పోస్ట్ చేసిన నోయల్ తాజాగా మరో పోస్ట్ చేశాడు. ఏ న్యూ బిగినింగ్ (కొత్త జీవితాన్ని ఆరంభించబోతోన్నాను) అని ఓ కామెంట్ చేశాడు. ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మళ్లీ పెళ్లా? బిగ్ బాస్‌లోకి వెళ్తున్నావా? ఏంటి అంటూ రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నోయల్‌కు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X