twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అరవింద్ పైనా నిషేధం?

    By Staff
    |

    జెమిని, ఈ టీవీ, మా టీవీల పై ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాడ్స్ విషయంలో బ్యాన్ పెట్టిన సంగితి తెలిసిందే.ఆ చానెల్స్ వారు సినిమా యాడ్స్ ప్రసారం చేసే విషయంలో అక్కువ అమౌంట్ కోట్ చేస్తున్నై. తెల్లారి లేచిన దగ్గర నుంచి సినిమా బెసేడ్ ప్రోగ్రామ్ ల పేరుతో సినిమా క్లిపింగ్స్ రుఉపై ఇవ్వకుండా అనుమతి లేకుండా చూపుతూ..తమకు అవసరమైన సినిమా ప్రమోషన్ ప్రకటన లో విషయంలో ఇలా మొండిచేయ్య చూపుతున్నారని వాదన. ఇది ఇలా ఉంటే మొన్న జరిగిన మగధీర ఆడియో ఫంక్షన్ ని మా టీవీ వారు లైవ్ టెలీకాస్ట్ చేసారు. దాంతో అల్లు అరవింద్ మీద ప్రొడ్గుర్రుగా ఉంది.

    తమ అనుమతి లేకుండా తమతో సహకరించని ఛానల్ కి ఎలా టెలీ కాస్ట్ హక్కులు ఇచ్చారని అడుగుతూ నోటీసు ఇచ్చారని సమాచారం. అయితే అల్లు అరవింద్ దానిని లెక్క చేయలేదని, సమాధానం ఇవ్వలేదని చెప్తున్నారు. దాంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు ఏవిధమైన సహకారం అల్లు అరవింద్ కి ఎవ్వకుడదని నిర్ణయం తెసుకుందని వినపడుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో ఆచి తూచి అడుగు వెయ్యాలని, అధికారికం గా ఈ విధమైన నిర్ణయం ప్రకటించలేదని అనుటున్నారు. ఇక మరో ప్రక్క ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా నిర్మాతల మండలి నుంచి నోటీసు అందుకున్నారు.

    రాజమౌళిపై నిషేధం నిర్ణయం నిర్మాత అడ్డాల చంటి ఇచ్చిన కంప్లైంట్ తో తీసుకున్నారు. అడ్డాల చంటి సెప్టెంబర్ 2002లో రాజమౌళికి సినిమా చేయమని ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. అయితే రాజమౌళి ఆ సినిమా చేయలేదు. దాంతో చంటి తన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించమన్నారు. దానికి రాజమౌళి ఒప్పుకోకపోవటంతో వివాదం మొదలైంది.అయితే వాదన విన్న నిర్మాతల మండలి వెంటనే రాజమౌళిని 36 పర్శంట్ వడ్డీతో పాతికలక్షల మొత్తాన్ని చెల్లించమని ఆదేశించింది. దానికి స్పందించకపోవటంతో ఈ నిర్ణయం నిర్మాతల మండలి తీసుకుని రాజమౌళిపై నిషేధం పెట్టారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X