పూరి-ఎన్టీఆర్ చిత్రంలో ఐటం గర్ల్ ఈమే(ఫొటో)

By Srikanya

హైదరాబాద్: పూరి జగన్నాథ్ ఇంకో అమ్మాయిని తన చిత్రంలో ఐటం సాంగ్ చేయించటానికి తెస్తున్నాడు. కెనిడయన్ మోడల్ అయిన నోరా ఫటేహి ని తన తాజా చిత్రంలోకి తీసుకున్నట్లు సమాచారం.ఎన్టీఆర్ చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ పాట హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ ...ఆమెతో కలిసి స్టెప్స్ వేయనున్నాడు. ఇదే నోరా కు తొలి తెలుగు చిత్రం. నోరా ఇప్పటికే హిందీలో క్రేజీ కుక్కెడ్ ఫ్యామిలీ చిత్రంలో నటిస్తోంది. ప్రకాష్ ఝా డైరక్షన్ లో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇక ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మణి శర్మ...యువ సంగీత దర్శకుల రాకతో కాస్త వెనకబడి పోయారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ బ్యాగ్రౌండ్ ఇవ్వడంలో మణిశర్మను మించిన వారు లేరనే చెప్పొచ్చు. అందుకే ప్రత్యేకంగా ఆయనతో బ్యాగ్రౌండ్ స్కోర్ కొట్టిస్తున్నారు పూరి జగన్నాథ్.

Nora Fatehi grooves with NTR in Puri Jagannadh's film

యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X