NBK108: బాలయ్యకు విలన్‌గా బాహుబలి నటి.. వీళ్లిద్దరి మధ్య ఆ సీన్ హైలైట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటిసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. అలాంటిది రెండేళ్ల క్రితమే ఆయన 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. దీని తర్వాత ఈ సీనియర్ హీరో మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీరసింహారెడ్డి' అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా అన్ని వర్గాల వాళ్ల నుంి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి సూపర్ హిట్ అయింది.
ప్రస్తుతం నటసింహా నందమూరి బాలకృష్ణ.. తన 108వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. 'వీర సింహా రెడ్డి' సినిమా వచ్చిన తర్వాత ఈ మూవీ షూటింగ్‌ను మొదలెట్టి ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అలాగే, జనవరి చివరి వారం నుంచే కొత్త షెడ్యూల్ అనుకున్నా.. తారకరత్న మరణం కారణంగా బాలయ్య షూటింగ్‌లో పాల్గొనలేనని చెప్పారు. దీంతో దీనికి కాస్త విరామం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో నటసింహా నందమూరి బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ నెగెటివ్ రోల్‌ను చేస్తున్నట్లు తెలిసింది. ఈమె పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. నోరాతో బాలయ్య చేసే ఫైట్ సీన్ ఒకటి సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీన్ని ఈ దసరాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











