twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ బద్రినాథ్ కాదు, బ్రహ్మీ బ్రమినాథ్ చూడండి..!

    By Sindhu
    |

    కమెడియన్ గా బ్రహ్మానందం వెండితెరపై తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాం లేదు. అడపా దడపా పిచ్చి కామెడీతో, పిచ్చి పిచ్చి వేషాలతో బెదరగొడ్తున్నా, బ్రహ్మానందమంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని జనం ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, బ్రహ్మానందం ఈ మద్య వెరైటీగా కన్పిస్తున్నాడు. అదీ మార్ఫింగ్ ఫోటోల్లో...

    ఆ మధ్యన 'శక్తి" సినిమా రిలీజయినప్పుడు కొందరు 'శక్తి" స్టిల్స్ లో ఎన్టీఆర్ ఫోటో మాయం చేసి, బ్రహ్మానందం తలకాయని ఫిక్స్ చేసి అదో టైపులో ఎంజాయ్ చేశారు. ఇంటర్నెట్ లో ఆ ఫోటోలు భలే కామెడీ పంచాయనుకోండి.. అది వేరే సంగతి..ఇప్పుడు తాజాగా 'బద్రినాథ్" స్టిల్స్ ని బ్రహ్మానందం ఫేస్ తో మార్ఫింగ్ చేసి, 'బ్రహ్మీ బద్రినాథ్" అంటూ కొందరు ఇంటర్నెట్ లో హడావిడి చేస్తున్నారు. టిట్ ఫర్ టాట్..అంటూ మెగాభిమానులకు కొందరు ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు కూడా వేస్తున్నారు ఈ ఫోటోలతో. సరదా కోసం చేసినా..సీరియస్ గా చేసిన..అభిమానుల మద్య ఫైటింగ్ కి బ్రహ్మీ తనకు తెలియకుండానే కేరాఫ్ అడ్రస్ అయిపోతున్నాడన్నమాట.

    English summary
    Creativity has no bounds. Every time a different look of top hero is out into market, Photo Shop artistic brains bring Brahmanandam into the scene. Thanks that only flop and torturing movie posters are selected for this exclusive morphing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X