వెబ్ సైట్స్ పై విరుచుకుపడ్డ హీరో నితిన్
దిల్ రాజు త్వరలో ప్రారంభించబోయే "ఓ మై ప్రెండ్" చిత్రంలో హీరో నితిన్ రెడ్డిని సెకెండ్ హీరోగా తీసుకున్నారనే వార్తలు అంతటా వచ్చిన సంగతి తెలిసిందే. సెకెండ్ హీరో అనే పదాన్ని నితన్ జీర్ణించుకోలకపోతున్నారు. ఈ విషయమై ఆయన రీసెంట్ గా ట్వీట్ చేస్తూ...చాలా నెట్ సైట్స్ క్రేజీగా ఉన్నాయి. వాళ్ళు చెత్త రాస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నారు..నేను దిల్ రాజు చిత్రం గానీ, సిద్దార్ధ సినిమాలో కానీ చెయ్యటం లేదు అన్నారు. అయితే సెకెండ్ హీరోగా మీరు చేస్తున్నారట కదా అని మీడియావారు అతన్ని అడగుతూండటమే కాకుండా పరిచయస్తులు సైతం హీరోగా ఛాన్స్ లు రాక సెకెండ్ హీరోకి వెళ్ళిపోయాడు అంటూ సానుభూతి చూపుతున్నట్లుగా మాట్లాడటమే ఆ కోపానికి కారణమని తెలుస్తోంది. ఇక దిల్ రాజు బ్యానర్ లో నితిన్ ని సెకెండ్ హీరోగా చేయమని అడిగిన మాట నిజమేనని, అయితే నితిన్ చేసేది లేనిది కన్ఫర్మ్ చేసి చెప్పలేదని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సిద్దార్ధ హీరోగా చేస్తున్నారు. అలాగే అతిధి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన అమృతారావుని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇక ఈ చిత్రంలో నితిన్, సిద్దార్ధ ప్రాణ మిత్రులుగా కనిపిస్తారు. నువ్వే కావాలి తరహా రొమాంటిక్ కామిడీ అని, ప్రేమ, స్నేహం చుట్టూ తిరిగే కధాంశంతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











