అత్యాశతో చేతులు కాల్చుకొన్న కాజల్.. యంగ్ హీరోయిన్ దక్కిన ఆఫర్
సినీ పరిశ్రమలో సుమారు రెండు దశాబ్దాలుగా పలు భాషల్లో రాణిస్తున్న కాజల్ అగర్వాల్‌కు ఎదురే లేకుండా పోయింది. స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోలందరితో కలిసి నటిస్తున్నది. చిరంజీవి, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ నుంచి కుర్ర హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలతో కూడా నటించి మెప్పించింది. అయితే తన గురువు లాంటి దర్శకుడు తేజ సినిమాను తిరస్కరించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే కాజల్‌ను పక్కన పెట్టి దర్శకుడు తేజ మరో స్టార్ హీరోయిన్ తీసుకోవడం వెనుక జరిగిన విషయాలు ఏమిటంటే..

లక్ష్మీ కల్యాణంతో టాలీవుడ్‌లోకి
లక్ష్మీ కల్యాణం అనే చిత్రంతో కాజల్ అగర్వాల్‌ను దర్శకుడు తేజ తెలుగు సినిమా పరిశ్రమకు చేయడం ఆ తర్వాత ఆమె వరుస అవకాశాలు అందిపుచ్చుకోవడంతో తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించింది. కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా భారీ రెమ్యునరేషన్‌ను అందుకొంటున్నది. ఎప్పుడు అవకాశం దక్కితే అప్పుడు తేజను ప్రశంసలతో ముంచెత్తడం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్‌లో వచ్చిన సీత చిత్రం డిజాస్టర్‌గా మారడం తెలిసిందే.

అలమేలు మంగ వెంకట రమణలో కాజల్‌ను
అయితే దర్శకుడు తేజ తాజాగా హీరో గోపిచంద్‌తో అలమేలు మంగ వెంకట రమణ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం తొలుత కాజల్ అగర్వాల్‌ను సంప్రదించడం ఆమె ఓకే చెప్పడం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే కొద్ది రోజులుగా ఆమె ఆ సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్త వైరల్ అయింది.

అధిక రెమ్యునరేషన్ కారణంతో
అయితే అలమేలు మంగ వెంకట రమణ నుంచి తప్పుకోవడానికి కారణం రెమ్యునరేషన్ అంశమే అనే వాదన బయటకు వచ్చింది. యూనిట్ ఆఫర్ చేసిన దానికంటే ఎక్కువ డిమాండ్ చేసింది. వారు అందుకు ఒప్పుకోకపోవడంతో కాజల్ సినిమాను చేయనని చెప్పి బయటకు వెళ్లింది. తేజ నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు అనే వార్తలు మీడియాలో షికారు చేశాయి.

కాజల్ స్థానంలో కీర్తి సురేష్
అయితే తాజా సమాచారం ప్రకారం.. అలమేలు మంగ వెంకట రమణ చిత్రంలో కాజల్‌ను తప్పించి ప్రస్తుతం మహానటితో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న కీర్తి సురేష్‌ను సంప్రదించారని, ఈ సినిమా స్క్రిప్టుపై ఆమెకు నచ్చడంతో నటించడానికి ముందుకు వచ్చారు. దాంతా ఆమెను ఎంపిక చేశారు అనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

30 శాతం రెమ్యునరేషన్ తగ్గించుకొన్న కీర్తి
ఇదిలా ఉండగా, కీర్తి సురేష్ లాక్‌డౌన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తన రెమ్యునరేషన్ తగ్గించుకొంటున్నట్టు వార్తలు వచ్చాయి. రాబోయే చిత్రాలకు తన రెమ్యునరేషన్‌ను 30 శాతం మేరకు తగ్గించుకొంటున్నానని బహిరంగ ప్రకటన చేయడం కూడా తేజ సినిమాకు కలిసి వచ్చింది. రెమ్యునరేషన్‌తోపాటు టాలెంటెడ్ నటిని ఎంపిక చేశామనే సంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వార్త అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Recommended Video

మహేష్‌తో సర్కారువారీ పాటలో కీర్తి సురేష్
కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో తెలుగులో వరుస ఆఫర్లు ఆమెను పలకరిస్తున్నాయి. మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. అలాగే నితిన్‌తో రంగ్ దే, దర్శకుడు నాగేష్ కుకునూరు దర్శకత్వంలో గుడ్ లక్ సఖీ అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. కుకునూర్ సినిమాలో షూటర్‌గా కీర్తి సురేష్ కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











