జాన్వీ కపూర్ కాదట.. ఆ హీరోతో ఐటెం గర్ల్ గా త్రిప్తి దిమ్రి!

రానున్న రోజుల్లో భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం "పుష్ప 2 ది రూల్" కూడా ఒకటి. మరి ట్రూ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి, కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ సీక్వెల్స్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ అంచనాలు ఉన్న సినిమాగా అయితే ఈ చిత్రం నిలిచింది.

మరి దీనిపై ఉన్న హైప్ కి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్స్ లు 2 పార్ట్ కోసం చేస్తుండగా ఈసారి లోకల్ గా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ హంగులతో తెరకెక్కుతున్నట్టుగా టాక్ ఉంది. ఇలానే ఆల్రెడీ సాంగ్స్ కూడా భారీ హిట్ అయ్యాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ అంటేనే ఒక మ్యూజికల్ హిట్ కాంబినేషన్ అని ఒక మార్క్ కూడా ఉంది.

not only janhvi kapoor triptii dimri name also for pushpa 2 item song

ఇక వీటిలో అయితే ఐటెం సాంగ్ కి ఉన్న క్రేజ్ కూడా మరో లెవెల్. ఆర్య నుంచి పుష్ప 1 వరకు కూడా ప్రతి ఐటెం సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యింది. ఇలా ఇప్పుడు పుష్ప 2 ఐటెం సాంగ్ పై కూడా భారీ హైప్ నెలకొనగా లాస్ట్ టైం ఐటెం సాంగ్ లో సమంత షైన్ అయితే ఈసారి అంతకు మించిన బ్యూటీని పెట్టాలని డిసైడ్ అయ్యారు.

అలా బాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్ హీరోయిన్స్ హాట్ బాంబ్స్ ని అనుకున్నారు అలా జాన్వీ కపూర్ దగ్గర ఆగారు. అయితే జాన్వీ పేరు దాదాపు ఖరారు అయ్యింది అనే సమయంలో ఇపుడు మరో క్రేజీ గాసిప్ వైరల్ గా వినిపిస్తుంది. దీనితో జాన్వీ కపూర్ తో పాటుగా పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం రీసెంట్ హాట్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి ని అనుకుంటున్నారట.

not only janhvi kapoor triptii dimri name also for pushpa 2 item song

అనిమల్ సినిమాతో భారీ క్రేజ్ ని తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పుష్ప రాజ్ సరసన కనిపిస్తే రీచ్ మరింత బాగుంటుంది అన్నట్టుగా ఇప్పుడు మేకర్స్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల త్రిప్తి నుంచి వచ్చిన బ్యాడ్ న్యూజ్ సినిమాలో హాట్ షోకే సోషల్ మీడియాలో క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. మరి అల్లు అర్జున్ లాంటి స్టార్ పక్కన ఓ సాలిడ్ మ్యూజికల్ నెంబర్ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

మరి త్రిప్తినా లేక జాన్వీన అనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ గా ఉంది. ఇంకో పక్క జాన్వీ గ్లామర్ షో "దేవర" లో అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. రీసెంట్ గా వచ్చిన దావుడి సాంగ్ లో జాన్వీ గ్లామర్ షోతో పాటుగా డాన్స్ కూడా చాలా ఎనర్జిటిక్ గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి పుష్ప రాజ్ సరేనా కనిపించే ఆ హాట్ బ్యూటీ ఎవరో వేచి చూడాలి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X