హను రాఘవూడి మూవీకి ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదా? ఫౌజి మూవీకి అనుకొన్నది ఏ హీరోనో తెలుసా?
మళ్ళీ పాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు సినిమాల హవా మొదలైంది. ఈ 2024 లోనే రెండు సెన్సేషనల్ హిట్స్ పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా అందించగా ఇక ముందు రోజుల్లో కూడా మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. కాగా ఈ లిస్ట్ లో గత కొన్ని రోజులు కితమే అనౌన్స్ చేసిన క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అదే రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ సినిమా.
కాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలుతో ఆరంభించగా ఈ సినిమా 1940 టైం లో జరిగే యుద్ధ నేపథ్యంలో కనిపించే సినిమా అన్నట్టుగా సినిమా కాన్సెప్ట్ కూడా రివీల్ చేశారు. అయితే ఇపుడు తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఈ సినిమాపై వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి హీరోగా ప్రభాస్ మొదటి ఛాయిస్ కాదు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా హను రాఘవపూడి ఈ చిత్రాన్ని మొదటిగా మన తెలుగు యువ స్టార్ హీరో మరొకరి కోసం డిజైన్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో నేచురల్ స్టార్ నానితో అట. నానితో హను రాఘవపూడి ఒక ఇంట్రెస్టింగ్ యుద్ధ నేపథ్య సినిమాని డిజైన్ చేసాడని ఆ సినిమానే ఇప్పుడు పలు కారణాలు చేత ప్రభాస్ వద్దకు వెళ్ళింది అంటూ ఓ టాక్ అయితే వైరల్ గా మారింది.
అయితే అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది చూస్తే.. నానితో హను ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాని చేయాలని అనుకున్నది అయితే నిజమే అట. కానీ అది ప్రభాస్ తో సినిమానో లేక లాస్ట్ గా తీసిన సీతారామం సినిమానో కాదట. నానితో అనుకున్న సినిమా కంప్లీట్ డిఫరెంట్ కథ కాగా ఈ రెండు సినిమాలు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే ప్లాన్ చేసినప్పటికీ సీతారామం సినిమా 1980 లలో కనిపిస్తుంది.
ప్రభాస్ సినిమా 1940 లలో కనిపిస్తుంది. అయితే నానితో ప్లాన్ చేసిన సినిమా వరల్డ్ వార్ 2 సమయంలో ఉంటుంది అని హను తెలిపాడు. వరల్డ్ వార్ 2 జరిగింది కూడా 1939 నుంచి 45 మధ్యలో కాబట్టి నానికి డిజైన్ చేసిన సినిమానే ప్రభాస్ దగ్గరకి వెళ్లి ఉండొచ్చు అని చెప్పడానికి ఆస్కారం లేకపోలేదు. అలాగే హను రాఘవపూడి తనకి యుద్ధ నేపథ్యంలోనే సినిమాలు చేయడం ఎక్కువ ఇష్టం అందుకే ఆ సంబంధిత కథలే ఎక్కువ రాసుకుంటానని కూడా ఓ సందర్భంలో చెప్పారు.

మరి ఈ లెక్కన ప్రభాస్ తో ప్లాన్ చేసిన సినిమా వేరు నానితో అనుకున్న సినిమా వేరు కూడా అయ్యుండొచ్చు. మొత్తానికి అయితే నానితో జరగాల్సిన సినిమా మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. కాగా ఈ చిత్రంలో ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈమె కూడా సినిమా లాంచ్ లో కనిపించింది. అక్కడ నుంచి ఇమాన్ కోసం సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా నడిచింది.


Click it and Unblock the Notifications











