OG: బిగ్ ట్విస్ట్.. ప్రభాస్ కాదు పవన్ సినిమాలో కనిపించేది ఈ స్టార్ హీరోనా??

రానున్న కొద్దిరోజుల్లో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పలు బిగ్గెస్ట్ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో దాదాపు ఒకో స్టార్ హీరో నుంచి ఒకటికి మించి ఎక్కువే ఉన్నాయి. ఇలాంటి హై వోల్టేజ్ సినిమాల్లో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాలు ఉన్నాయి. వాటిలో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం "హరిహర వీరమల్లు" ఒకటి కాగా, మరొకటి పవన్ వీరాభిమాని సుజీత్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ సినిమా "ఓజి".

నిజానికి ఓజి కంటే ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా "హరిహర వీరమల్లు"నే. కానీ ఒక్కసారి ఓజి అనౌన్స్ అయ్యాక అందరి కళ్లు ఈ మూవీ వైపు షిఫ్ట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై ఓ రేంజ్‌లో బజ్ ఉంది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ వేగంగానే పూర్తి చేసినప్పటికీ , కొన్ని రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అయితే షూటింగ్ కి మాత్రం ఆయన డేట్స్‌ని ఇవ్వలేకపోతున్నారు.

not prabhas this kannada hero in pawan kalyan og climax

దీనితో ఓజి మరింత ఆలస్యం అవుతుంది కానీ హైప్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇదిలా ఉండగా ఓజి సినిమాపై పలు క్రేజీ రూమర్స్ సినీ వర్గాల్లో ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఎక్కువ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తోనే. దర్శకుడు సుజీత్ తో చేసిన సాహో కి ఓజీకి కనెక్షన్ ఉన్నట్టుగా పలు వార్తలు వైరల్ గా మారాయి.

ఇక వీటితో పాటుగా నిన్ననే ఓజి క్లైమాక్స్ లో ఏకంగా ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది అన్నట్టుగా రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. దీనితో మేకర్స్ వీటిపై ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇపుడు ఫ్రెష్ రూమర్స్ ఏమిటంటే ఓజి క్లైమాక్స్ లో ఓ బిగ్ స్టార్ ఎంట్రీ ఉంటుంది అనేది నిజమేనట. కానీ అది ప్రభాస్ అనేది ప్రస్తుతానికి అవాస్తవం.

not prabhas this kannada hero in pawan kalyan og climax

సరే దీని ప్రకారం ప్రభాస్ కాకపోతే ఆ రోల్ ని ఇంకో స్టార్ చేయాల్సిందే కదా! మరి లేటెస్ట్ రూమర్స్ ఏమిటంటే ఈ పాత్రని మన తెలుగు బిగ్ స్టార్ కాదు కానీ కన్నడ సినిమాకి చెందిన బిగ్ స్టార్ చేయనున్నారు అంటూ కొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరో ఎవరో కాదు కన్నడ అభినయ చక్రవర్తి మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలిసిన హీరో కిచ్చా సుదీప్ అట.

ఇపుడు సుదీప్ పేరే ఎందుకు వచ్చింది అంటే. గతంలో సుజీత్ సుదీప్ తో వర్క్ పై ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ గా మారింది. సుజీత్ తో ఆల్రెడీ తాను ఓ సినిమా డిస్కషన్స్ లో పాల్గొన్నామని సుజీత్ దగ్గర పలు క్రేజీ ఐడియాస్ కూడా ఉన్నాయి. మేము ఓ సినిమా చేస్తామని తాను తెలిపాడు. ఇది పక్కన పెడితే కొన్నేళ్ల ముందు ఒకసారి సడెన్ గా సుదీప్ పవన్ కళ్యాణ్ ని కలవడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ డాట్స్ అన్నీ కలిపి చూస్తే ఈ క్రేజీ కాంబినేషన్ పై కూడా పాజిబులిటీ ఉందని చెప్పొచ్చు. మరి ఓజి క్లైమాక్స్ లో వచ్చే ఆ స్టార్ ఎవరో డెఫినెట్ గా చూడాల్సిందే. ప్రస్తుతానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ న్యూస్ మంచి సస్పెన్స్ గా మారింది.

More from Filmibeat

Read more about: pawan kalyan og sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X