మహేశ్ బాబుకు చిరంజీవి సాయం.. వాళ్లు మాత్రం ఇది కచ్చితంగా ఊహించి ఉండరు.!
'భరత్ అను నేను', 'మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన ఉత్సాహంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు దూకుడు ప్రదర్శిస్తున్నాడు. వరుస విజయాల తర్వాత ఈ బడా హీరో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే దీనిపై ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అదే సమయంలో అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి సాయం చేయబోతున్నాడంటూ తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆయనను ఎందుకు వాడుతున్నారు.?

ఇప్పటి నుంచే సరిలేరు అనేలా
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు' హవా చూపిస్తోంది. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి పాటకూ, టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ టీజర్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయగా.. వారానికి ఒకటిగా విడుదలవుతున్న పాటలు కూడా మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది.

మెగా సినిమా నుంచి పోటీ
సంక్రాంతి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు' విడుదల కానుంది. అదే సమయంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో..' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బడా మూవీ నుంచి పోటీని తట్టుకునేందుకు మహేశ్ అండ్ టీమ్ ఎన్నో ప్లాన్స్ చేస్తోంది. ఇప్పటికే ప్రమోషన్‌లో సరికొత్త పద్దతులను పరిచయం చేసేసింది.

మెగా హీరోల కోసం వ్యూహాలు
అల్లు అర్జున్ మెగా కాంపౌండ్‌కు చెందిన హీరో కావడంతో.. అక్కడి వారితోనే తమ మూవీకి సాయం చేయించుకోవాలని సరిలేరు టీమ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తీసుకు రావాలని ప్రయత్నాలు చేసింది. ఏమైందో ఏమో కానీ, చెర్రీ ఈ ఫంక్షన్‌కు రావడం లేదని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

మహేశ్‌కు చిరంజీవి సాయం
సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ గురించి ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. దీని ప్రకారం ఈ సినిమా ఫంక్షన్ జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. దీనికి భారీగా ఫ్యాన్స్ వస్తారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

‘సరిలేరు'లో ఎవరెవరున్నారు?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న చిత్రమే ‘సరిలేరు నీకెవ్వరు'. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, లేడీ అమితాబ్ విజయశాంతి, బండ్ల గణేష్, సంగీత, హరితేజ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











