బిగ్ ట్విస్ట్.. "సంక్రాంతికి వస్తున్నాం" ఫస్ట్ ఛాయిస్ వెంకీ మామ కాదా? ఎవరో తెలిస్తే షాకే..
తెలుగు సినిమా దగ్గర కొత్త ఏడాది ఆరంభం తోనే వచ్చే మొట్టమొదటి పెద్ద పండగ అది కూడా తెలుగు పండగ సంక్రాంతి. మరి ఈ బిగ్ ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ దగ్గర సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు వరకు ఎన్నో సంక్రాంతి సినిమాలు వచ్చాయి. అయితే ప్రతీసారి సంక్రాంతి బరి పోటీ మంచి రసవత్తరంగానే ఉంటుంది. మరి ఇలా ఈ 2025 సంక్రాంతికి కూడా పలు భారీ సినిమాలు రాబోతున్నాయి.
కాగా ఈసారి మాత్రం మన దగ్గర పూర్తిగా తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ కి వస్తుండడం విశేషం కాగా ఒక్కటంటే ఒక్క డబ్బింగ్ సినిమా కూడా మన దగ్గర లేదు. దీనితో మొత్తం మూడూ తెలుగు సినిమాలే రిలీజ్ కి ఉన్నాయి. కాగా ఆ చిత్రాలే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ అలాగే ఫైనల్ గా విక్టరీ వెంకటేష్ నటించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం"లు ఉన్నాయి.

కాగా ఈ సినిమాలు అన్నిటికీ మంచి బజ్ ఉంది. అయితే సంక్రాంతి కానుకగా వస్తున్న లాస్ట్ సినిమానే వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం కాగా ఈ సినిమా విషయంలో ఒక ఊహించని బిగ్ ట్విస్ట్ ఇపుడు బయటకి వచ్చింది. ఈ సినిమాకి ముందే ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో వెంకీ మామకి భారీ బ్లాక్ బస్టర్స్ ని అనీల్ రావిపూడి అందించడం జరిగింది. ఇక ముచ్చటగా మూడోసారి ఈ సబ్జెక్టుకి వెంకీ మామతో మళ్ళీ చేశారు.
కాగా ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అసలు ఈ సినిమాకి మొదట అనుకున్న హీరో వెంకీ మామ కాదట.. మరి మొదటగా అనీల్ రావిపూడి ఈ సినిమాని ఎవరితో ప్లాన్ చేద్దాం అనుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే అని చెప్పాలి. మరి తాను ఈ సినిమాని ఎవరితోనో కాదు మెగాస్టార్ చిరంజీవితో చెయ్యాలని అనుకున్నాడట.

ఈ సినిమా ఫ్యామిలీ మూమెంట్స్ మెయిన్ గా ఆ కామెడీ టైమింగ్ వంటి వాటికి మెగాస్టార్ పర్ఫెక్ట్ గా సరిపోతారు అని చిరంజీవినే అనుకున్నాడట కానీ కొన్ని పరిస్థితులు రీత్యా వెంకీ మామ లైన్ లోకి రావడం జరిగింది. మరి అనీల్ రావిపూడి సినిమాల్లో కామెడీ టైమింగ్ లో మెగాస్టార్ సినిమా మిస్ అయ్యిందని చెప్పాలి. కానీ ఈ సినిమా కాకుండా మరో క్రేజీ సబ్జెక్టుతో మెగాస్టార్ ని తాను డైరెక్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.
కాగా ఇపుడు చిరు భారీ సినిమా "విశ్వంభర"లో బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత రీసెంట్ గానే యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మాస్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అలాగే అనీల్ రావిపూడి సినిమాపై అధికారిక క్లారిటీ తర్వాత రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ మామ సరసన ఐశ్వర్య రాజేష్ ఆలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. ఈ జనవరి 14న సినిమా రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











