హాట్ టాపిక్: "బాహుబలి" పుస్తకం
హైదరాబాద్: ప్రభాస్, అనుష్క , తమన్నా, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బాహుబలి'. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం పుస్తకం రెడీ చేస్తున్నారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ పుస్తకంలో చిత్రం మేకింగ్ గురించి ఉంటుందని చెప్పుకుంటున్నారు. చిత్రం కోసం వేసిన స్కెచ్ లు, షూటింగ్ విశేషాలతో ఈ పుస్తకం సిద్దం చేస్తున్నట్లు వినికిడి. సినీ లవర్స్ కు ఈ పుస్తకం మంచి గిప్టే మరి.
https://www.facebook.com/TeluguFilmibeat
చిత్రం విశేషాలకు వస్తే...
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ''బాహుబలి'' కోసం వెయ్యి గుర్రాలు సిద్ధమవుతున్నాయి. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాహుబలి కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఓ అద్భుత యుద్ధ సన్నివేశం కోసం రాజమౌళి వెయ్యి గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. బాహుబలిని అద్భుతంగా తెరకెక్కించేందుకు ఎక్కడా రాజీ పడని రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించడంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో యుద్ధ సన్నివేశం చిత్రీకరణ కోసం రాజమౌళి రాజస్థాన్ నుంచి వెయ్యి గుర్రాలను తీసుకోస్తున్నారట. ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెయ్యి గుర్రాలతో కూడిన యుద్ధ సన్నివేశాన్ని సోమవారం నుంచి షూట్ చేస్తారని సమాచారం. ప్రభాస్, రానా , అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం తమన్నా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. సెట్స్ మీద ఉంటే ఆమెకు ఆకలి కూడా వేయట్లేదట. ‘‘మామూలుగా నేను మధ్యాహ్నం ఒంటిగంటకే భోజనం చేస్తాను. కానీ ‘బాహుబలి' సెట్స్ మీద ఉంటే నాకు ఆకలి వేయడం లేదు. తర్వాతి షాట్‌ను ఎలా కంపోజ్ చేశారో, ఎలా ఉండబోతోందో అనే ఆలోచనలతోనే కడుపు నిండుతోంది. ఒక విధమైన కుతూహలంతో ‘బాహుబలి' సెట్లో పనిచేస్తున్నాను'' అని ట్వీట్ చేసింది తమన్నా.
ఆ మధ్యన నిర్మాతలు విడుదల చేసిన సినిమా స్టిల్‌లో ప్రభాస్‌ను చూస్తే టైటిల్‌కు సంపూర్ణ న్యాయం చేస్తున్నవాడిలా కనిపించాడు. వీరయోధుడి దుస్తుల్లో, రెండు చేతుల్లో ఆయుధాలతో, కండలు తిరిగిన దేహంతో ఉన్న ప్రభాస్ రూపానికి నిజంగానే విశేషమైన స్పందన వచ్చింది.
మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.

ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. హిల్ ఏరియా సమీపంలో 'బాహుబలి'...ప్రభాస్, 'భళ్లాలదేవుడు' రానాపై పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫోని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... వాట్స్ అప్ యాప్ లో దొరుకుతుందని చెప్తున్నారు. ఈ మేరకు 809675522 నెంబర్ ని విడుదల చేసారు. ఈ నెంబర్ ని మీరు వాట్సప్ లో యాడ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు చిత్రం గురించి ఎక్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.
ఇక ...
కవచాలు, శిరస్త్రాణం ధరించి, కరవాలం చేతపట్టి యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడే యోధుడిగా ప్రభాస్ తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. 'మేకింగ్ ఆఫ్ బాహుబలి' పేరుతో ఇప్పటికే పలు వీడియోలను చిత్రం బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.
'బాహుబలి' గా ప్రభాస్ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.
రాజమౌళి కొత్త ఆలోచన:
లైవ్ యాక్షన్ సినిమా, విజువల్ ఎఫెక్ట్స్ ఆధారిత సినిమా.. ఈ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. కెమెరా ముందు జరుగుతున్న సన్నివేశాన్ని యథాతథంగా చూపించడం లైవ్ యాక్షన్ సినిమా. ఖాళీ ప్రదేశంలో బ్లూమేట్ ముందు చిత్రీకరించి ఆ తర్వాత దానికి విజువల్ ఎఫెక్ట్స్ జోడించి ఏ పెద్ద కోట లోపలో, లేదా కోట ముందో ఉన్నట్లు చూపించడం విజువల్ ఎఫెక్ట్స్ ఆధారిత చిత్రమవుతుంది. రెండో రకం చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురుగా ఏమీ లేకుండానే ఉన్నట్లు భావించి నటించాల్సి వస్తుంది.
ఇలాంటి సన్నివేశాలకు దర్శకత్వం వహించడం కష్టసాధ్యమైన పనే. అందుకే బ్లూమేట్ ఆధారంగా తీసే సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే కళ్లకు విజువల్ ఎఫెక్ట్స్ కనపడేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి. ఆయన తాజా చిత్రం 'బాహుబలి' కోసం ఏఎండీ అనే విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో కలసి పని చేస్తున్నారు. ఈ పనిలో మరో సంస్థ మకుట కూడా పాలుపంచుకుంటోంది. ఏఎండీ తాజాగా ఓ మైక్రోచిప్ తయారు చేసే పనిలో ఉందట.
ఓ చిప్‌లో మొత్తం ఎఫెక్ట్స్‌ను అప్‌లోడ్ చేసి దాన్ని కళ్లజోడుకు జోడించి చూస్తే బ్లూమేట్ మీద ఏమైతే విజువల్ ఎఫెక్ట్స్‌ని మిక్స్ చేస్తారో.. అవి కనిపిస్తాయి. దీని వల్ల చిత్రీకరణ సులభతరమవుతుంది. రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి రూపొందించిన వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టారు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











