లీకైంది: పూరి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర, పేరు

By Srikanya

హైదరాబాద్: ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం గోవాలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇన్సపెక్టర్ దయ గా కనిపించనున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా రగ్గడ్ గా ఉండబోతోందని, చాలా సార్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పాత్ర ఇదని చెప్తున్నారు. సర్కిల్ ఇన్సపెక్టర్ గా ఎన్టీఆర్ చెలరేగిపోతున్నాడని వినికిడి. నాగార్జున శివ మణి లో చేసిన పాత్ర తరహాలో పూర్తి మాస్ టచ్ లో ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ సినిమా అంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్‌. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకుండూంటంతో మంచి క్రేజ్ వస్తోంది. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాత. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడ యాక్షన్‌ ఘట్టాలతో పాటు కొన్ని సరదా సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ శక్తిమంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తాడని సమాచారం.

Now NTR Is 'Inspector Daya' in Puri's Movie

వక్కంతం వంశీ చెప్పిన కథ ఎన్టీఆర్‌కి బాగా నచ్చింది. అందుకే మరో ఆలోచన లేకుండా, 'రభస' తరవాత కాస్త కూడా విరామం తీసుకోకుండా - సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అలియాభట్‌ పేరు పరిశీలనకు వచ్చినా, చివరికి కాజల్‌ని ఖాయం చేసేశారు. ఈ చిత్రానికి 'కుమ్మేస్తా', 'టెంపర్‌', 'నేనో రకం','షంషేర్'., ... ఇలా పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో 'టెంపర్‌'కే ఎక్కువ ఛాన్స్‌ ఉందని అంటున్నారు. జనవరి 9న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ప్రస్తుతం గోవాలో ఓ పాటతో సహా పోరట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారుయ ఇటీవల ఉత్తరాంధ్రాలో సంబవించిన తుఫాన్‌ కారణంగా వైజాగ్‌ షెడ్యూల్‌ను సైతం గోవాలోనే షూట్‌ చేయనున్నారని వినిపిస్తుంది. ఇప్పటికే పలుకారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యమవ్వడంతో ఆన్‌ సెట్స్‌లోనే పూరీ ఎస్‌. ఆర్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో ఎడిటింగ్‌ పనులు కూడా చేయిస్తున్నారని యూనిట్‌ అంటోంది. ఈనెలలో సినిమా ఫస్ట్‌లుక్‌ ప్రచార చిత్రాలను కూడా విడుదల చేయాలని యూనిట్‌ భావిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X