twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగంలోకి ఎన్టీఆర్.. చాలా కీలకం.. స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు!

    |

    Recommended Video

    Jr NTR Into The RRR Sets At Balgeria || Filmibeat Telugu

    బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో భారీ సినిమా 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్, ఇతరత్రా వివరాల కోసం ప్రేక్షకలోకం ఎంతగానో ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు తాజాగా అందిన సమాచారం మెగా, నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది.

    రంగంలోకి ఎన్టీఆర్

    రంగంలోకి ఎన్టీఆర్

    గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న 'RRR' సినిమాకి మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వాటిని అధిగమిస్తూ అనుకున్న సమయానికి రిలీజ్ చేసేలా ముందుకు సాగుతోంది 'RRR' టీం. ఈ మేరకు తాజాగా బల్గేరియాలో షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఎన్టీఆర్‌పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

    రాజమౌళి స్పెషల్ కేర్

    రాజమౌళి స్పెషల్ కేర్

    ఇద్దరు స్టార్ హీరోలతో తీస్తున్న మూవీ కావడంతో ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి మరీ చిత్రీకరిస్తున్నారట. నిర్మాణ వ్యయంతో పాటు టెక్నికల్ వ్యాల్యూస్‌పై ఏ మాత్రం వెనక్కితగ్గడం లేదట. బల్గేరియాలో షూట్ చేస్తున్న ఈ సన్నివేశాలు చిత్రానికే హైలైట్ కానున్నాయట. అందుకే హాలీవుడ్ నిపుణుల సమక్షంలో స్పెషల్ కేర్ తీసుకొని తెరకెక్కిస్తున్నారట జక్కన్న.

    అప్పటి వరుకు అక్కడే.. ఆ వెంటనే

    అప్పటి వరుకు అక్కడే.. ఆ వెంటనే

    సెప్టెంబరు మొదటి వారం వరకూ ఎన్టీఆర్ సహా చిత్రయూనిట్ అంతా అక్కడే ఉంటుందని సమాచారం. ఇక ‘RRR' కోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్‌ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. ఈ మేరకు బల్గేరియా షెడ్యూల్ పూర్తయిన వెంటనే హైదరాబాద్ లోని ఈ సెట్‌లో మరో షెడ్యూల్ ప్రారంభించనుంది RRR టీం.

    ఎన్టీఆర్ హీరోయిన్.. రాజమౌళి ప్లాన్ ఇదే

    ఎన్టీఆర్ హీరోయిన్.. రాజమౌళి ప్లాన్ ఇదే

    ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించనున్న హీరోయిన్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్కంఠకు బల్గేరియా షెడ్యూల్ లోనే ఫుల్‌స్టాప్ పెట్టేయాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ మెసేజ్ రానప్పటికీ హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్‌ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

    RRR మూవీ

    RRR మూవీ

    1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఆలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో హై రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల కానుంది.

    English summary
    RRR movie new schedule started in Balgeria. The director Rajamouli intrested to take farien heroine with ntr role in the movie. This movie shooting successfully going On.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X