సుకుమార్ కు సినిమా ఓకే అయ్యింది
హైదరాబాద్ : 1 నేనొక్కడినే చిత్రం పరాజయంతో సుకుమార్ కి తెలుగులో అనుకున్నట్లగా సినిమా రాలేదు. పెద్ద హీరోలు ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో ఎన్టీఆర్ తో సినిమా ఉందని వచ్చినా తర్వాత లేదని చెప్పుకున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కి సుకుమార్ కథ చెప్పారు కానీ ఓకే కాలేదని వినిపించింది. అయితే తాజాగా ఎన్టీఆర్ తో ప్రాజెక్టు అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఇక ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. 1 నేనొక్కడినే చిత్రం విడుదల అయిన వెంటనే ఈ చిత్రం ఉంటుందని భావించారు. అయితే రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు ఓకే అయ్యిందని, ఎన్టీఆర్ 25 వ చిత్రంగా ఇది ఉండబోతోందని తెలుస్తోంది.

రీసెంట్ గా ఎన్టీఆర్ ని సుకుమార్ కలిసి కథ చెప్పారని, దానికి వెంటనే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని రిలియన్స్, ఎస్ వి సిసి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. సంక్రాంతి 2016 లో ఈ చిత్రం విడుదల కానుంది. పూరీ చిత్రం తర్వాత ఈ చిత్రం పట్టాల ఎక్కనుందని తెలుస్తోంది. నాగార్జున, పీవీపి కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఆగిందని, దాని ప్లేసులో ఇది వచ్చిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











