»   » హాట్ న్యూస్ :ఎన్టీఆర్ 25...సుకుమార్ కే

హాట్ న్యూస్ :ఎన్టీఆర్ 25...సుకుమార్ కే

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
     NTR 25th film for Director Sukumar!
    హైదరాబాద్: సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం వెంటనే ఉండదని,ఎన్టీఆర్ 25 వ చిత్రంగా ఉండబోతోందని సమాచారం. సుకుమార్ రీసెంట్ గా స్టోరీ నేరేషన్ ఇచ్చారని, అయితే మరింత మార్పులతో డవలప్ చేసి తెరకెక్కించటానికి సమయం అడిగారని తెలుస్తోంది. దాంతో మధ్యలో ఓ చిత్రం పూరీ జగన్నాథ్ తో కానీ శౌర్యం శివ కానీ చేసి సుకుమార్ చిత్రం వద్దకు వస్తానని మాట ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 23 వ చిత్రంగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. తర్వాత మరో చిత్రం చేసి..అప్పుడు 25 వ చిత్రంగా సుకుమార్ ది పట్టాలు ఎక్కించనున్నారు.

    సెప్టెంబర్ నుంచి కానీ అక్టోబర్ మొదటి వారం నుంచి సుకుమార్ తో చిత్రం మొదలు కానుంది. ఈ నెలాఖరున ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ప్రకటన చేసే అవకాసం ఉంది. అయితే నేనిక్కడినే చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ కావటంతో ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అయితే ఈ విషయమై మీడియాతో సుకుమార్ మాట్లాడి క్లారిఫై ఇచ్చారు. ఆయన అటువంటిదేమీ లేదని స్పష్టం చేసారు. తాను పూర్తిగా స్క్రిప్టుపై బిజీగా ఉన్నానని అన్నారు. నిర్మాతలు సైతం ఇది రూమరే అని ఖండించారు.

    సుకుమార్ మాట్లాడుతూ... "ఎవరు,ఎందుకు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారనే విషయం నాకు అర్దం కావటం లేదు. నేను,ఎన్టీఆర్ ఈ గాసిప్స్ విని నిజంగా నవ్వుకున్నాం. ప్రాజెక్టు ఆన్ లోనే ఉంది..స్క్రిప్టు వర్క్ జరుగుతోంది ," అన్నారు. ఈ చిత్రం కోసం ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. పుణేలో దర్శకుడు కథా చర్చలతో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు తారాగణం, సాంకేతిక బృందం ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాకి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత.

    మరో ప్రక్క ఎన్టీఆర్‌ హీరోగా సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ గణేష్‌ నిర్మాత. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజు సుందరం నృత్య రీతులు సమకూరుస్తారు.

    దర్శకుడు మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ శైలికి తగ్గ కథ ఇది. హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తూ... వైవిధ్యంగా ఉంటాయి. ఇటీవల పొల్లాచ్చిలో అందమైన లొకేషన్లలో తెరకెక్కించిన పాట సినిమాకి ఆకర్షణగా నిలుస్తుంది. ఎన్టీఆర్‌ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అన్నారు. సినిమాకి 'రభస' అనే పేరుని పరిశీలిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌ని కొత్తగా చూపించే చిత్రమిది. ఆయన సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి'' అన్నారు. ఈ చిత్రానికి 'రభస' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. 'అత్తమడుగువాగులోనా.. అత్తకూతురో' అనే పాటను రీమిక్స్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    Director Sukumar met NTR recently and narrated the Story and it was okayed by the Hero. The Action/family entertainer will now become NTR's 25th film with 23rd being the ongoing Santosh Srinivas film. 
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more