ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. 'పాలిటిక్స్ చేయడానికి రెడీ'.. వచ్చే నెలలోనే?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటించారు. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. మరో రెండు కొత్త డేట్లు ప్రకటించారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

 బల్క్ డేట్స్

బల్క్ డేట్స్

2018లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఫ్యాక్షన్ రాజకీయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి RRR కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ ఇచ్చారు.

కొరటాల శివతో

కొరటాల శివతో

ఇక రాజమౌళి RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తోనే సినిమా చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ఆ స్థానంలో కొరటాల శివ ఎన్టీఆర్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేయనుండగా ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు.

ఫిబ్రవరి 7న

ఫిబ్రవరి 7న

అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన మినహా ఈ సినిమా నుంచి మరెలాంటి ప్రకటన వెలువడక పోవడంతో ఈ సినిమాలో నటించే వారి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి.
RRR వాయిదాలతో ఇప్పటికే నిరుత్సాహానికి గురైన ఎన్టీఆర్ అభిమానులు కనీసం ఆలస్యం చేయకుండా #NTR30 షూటింగ్‌ని ప్రారంభించాలని కోరుకుంటున్నారు. వారి ప్రార్థనలు ఫలించడంతో ఫిబ్రవరి 7న సినిమా ప్రారంభం కానుందని అంటున్నారు.

విద్యార్థి నేత

విద్యార్థి నేత

తాజా సమాచారం మేరకు అప్పటికి కోవిడ్ కేసులు అదుపులోకి వస్తే అదే బెబాకి షూటింగ్ ప్రారంభించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి అలియా భట్ కథానాయికగా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ సినిమా కధ గురించి కూడా ఒక లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ బ‌స్తీ నుంచి చ‌దువుకుని మంచి విద్యార్థి నేత అవుతాడు.

Recommended Video

Senior Actor Rajasekhar In Jr.NTR's Next Project | Filmibeat Telugu
పొలిటికల్ టచ్

పొలిటికల్ టచ్

అయితే రాజ‌కీయ నాయ‌కులు వ‌ల్ల విద్యార్థుల చ‌దువుకు ఆటంకం ఏర్ప‌డితే వారికి అండ‌గా ఎన్టీఆర్ నిల‌బ‌డి పోరాటం చేసేశాడ‌నేదే క‌థ అని టాక్‌ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారని అంటున్నారు. ఈ సినిమాకు కొర‌టాల శివ ఎక్కువ‌గా పొలిటిక‌ల్ ట‌చ్ ఇస్తున్నార‌ని చెబుతున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ పొలిటికల్ టచ్ ఉన్న సినిమా చేస్తుండడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X