NTR 30: కొరటాల శివకు హ్యాండ్ ఇచ్చేసిన అలియా భట్.. ఎన్టీఆర్ సినిమాకు మరో సమస్య..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా అగ్ర హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిపోతున్నారు. ఇక వారితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా బాగానే ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక అలియా భట్ కూడా రానున్న రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని బాగానే ప్రయత్నం చేస్తోంది. ఇక ఎన్టీఆర్ 30వ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా ఇటీవలే ఆమే వల్లనే సినిమాకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

సౌత్ లో కూడా..
బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న అలియా భట్ రానున్న రోజుల్లో సౌత్ లో కూడా తన మార్కెట్ ను పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఈ బ్యూటీ నటించిన RRR సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి పాత్రకు జోడిగా సీత పాత్రలో కనిపించనుంది. సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు..

ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్
ఇక అలియా భట్ RRR సినిమా అనంతరం ఎన్టీఆర్ రాబోయే 30వ సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకున్నట్లుగా క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల గంగుభాయ్ ఖతీయావాడి సినిమా ప్రమోషన్ లో భాగంగా అలియా భట్ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అవును ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అని కొరటాల శివ స్క్రిప్ట్ గురించి కూడా చెప్పినట్లుగా వివరణ ఇచ్చారు.

ఆమె హ్యాండ్ ఇవ్వడంతో..
ఇక ఎన్టీఆర్ 30వ సినిమాను దర్శకుడు కొరటాల శివ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ గత రెండు మూడు నెలల నుంచి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రతీసారి ఏదో ఒక కారణంగా ఆ సినిమా లాంచింగ్ ఆలస్యం అవుతూనే ఉంది. ఇక మరోసారి అలియా భట్ హ్యాండ్ ఇవ్వడంతో సినిమాకు సమస్యగా మారిందని కథనాలు వెలువడుతున్నాయి.

అలియా భట్ వస్తేనే..
అసలైతే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేయాలని అనుకున్నారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి అలియా భట్ వస్తే నేషనల్ మీడియాలో కూడా సినిమా పై మంచి బజ్ క్రియేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే అలియా భట్ ఈ రెండు వారాలు బిజీగా ఉండడం వలన రాలేను అని చెప్పిందట. దీంతో కొరటాల శివ ప్లాన్ కు బ్రేక్ పడింది.

బిజీగా ఉండడం వలన..
గంగుబాయ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉండడం వలన అలియా భట్ మరే విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా లాంచ్ కు కూడా రాలేను అని చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేసిందట. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఆమె కోసం మరోసారి కొత్త డేట్ ను ఫిక్స్ చేసుకోవాలని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరి సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం బిజీగా ఉండడం వలన లాంచ్ ఈవెంట్ ను తరువాతనే చేస్తే బెటర్ అని సలహా ఇచ్చినట్లు టాక్.


Click it and Unblock the Notifications











