twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ నటన చూసి పెరిగిన ‘శ్రీకాంత్’

    By Sindhu
    |

    చిన్నప్పుడే 8వ తరగతినుంచి సినిమాలు బాగా చూసేవాడిని. నేను కర్నాటకలో పెరిగాను. అక్కడ ఎన్టీఆర్ సినిమాలు బాగా ఆడేవి. ఆయన సీఎం అయ్యాక చిరంజీవిగారి సినిమాలు వచ్చేవి. ఖైదీకి ముందు నుంచే నేనుండే గంగావతి నుంచి బళ్ళారి వెళ్లి సినిమాలు చూసేవాడిని. అది ఎంతవరకు వెళ్ళిందంటే టెన్త్ పూర్తవ్వగానే చెన్నై పారిపోయాను. అక్కడ డిగ్రీపూర్తి చేసి మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరాను. ఆ తర్వాత విజయవాడ లక్ష్మీఫిలింస్ మూర్తిగారు నన్ను ప్రోత్సహించడంతో ఉషాకిరణ్ మూవీస్ లో పనిచేయడం జరిగిందన్నారు.

    అలా ఉషాకిరణ్‌మూవీస్ 'పీపుల్స్ ఎన్‌కౌంటర్' నుంచి అంచెలంచెలుగా ఎదిగి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరో అయిన శ్రీకాంత్ 'మహాత్మా" తో వంద చిత్రాలను పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ పలు విషయాలను తన మాటల్లో చెప్పారు. చిన్నపాత్రనుంచి విలన్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మెల్లగా హీరోగా ఎదిగానన్నారు. మళ్లీ మరో హీరోతో కలిసి నటించాను. ఇలా ఒక్కో సినిమా ఒక్కో మజిలీ. నా సినీ కెరీర్‌లో చిరంజీవితో నటించేటప్పుడు పొందిన ఆనందం అంతా ఇంతాకాదు. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలు చూసేందుకు ఎగబడేవాడిని. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూసేవాడిని. అటువంటి నటుడితో కలిసి శంకర్‌దాదా జిందాబాద్ నటిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇకపోతే.. పూర్తిస్థాయి పౌరాణిక పాత్రలో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఎన్టీఆర్ గారిని కృష్ణుడి పాత్రలో చూసి పెరిగిన వాడిని. 'సుప్రభాతం"తో మీసాలు, గాగుల్స్ పెట్టి కామిక్‌గా ఓ పాటలో ఆ పాత్ర ట్రై చేశా. కానీ పూర్తిగా చేయాలనే కోరిక తీరలేదు.

    1998లో వరుసగా 9 సినిమాలు ప్లాప్ అయ్యాయి ఆ టైమ్‌లో స్నేహితులనుగానీ, కుటుంబసభ్యులనుకానీ కలిసేవాడిని కాదు. ఆ టైమ్‌లో చిరంజీవి నుంచి కాల్ వచ్చింది. అంతకుముందే ఆయనను కలిసేవాడిని. ఈ ఫ్లాప్ గ్యాప్‌లో చిరును కూడా కలవలేదు. 'అంజి" సినిమా షూటింగ్ టైమ్‌లో ఆయన నన్ను అన్నపూర్ణ స్టూడియోలో చాలాసేపు యోగక్షేమాలు అడిగారు. నేను డైలామాలో ఉంటే ఆయన తన జీవితంలో మేకప్‌లేకుండా ఏడాదిపాటు ఉన్న విషయాన్ని చెప్పారు. అపజయం వస్తే కుంగిపోకూడదని హితోపదేశం చేశారు. అప్పటి నుంచి నాలోతెలీని ధైర్యం వచ్చింది. ఇది ప్రధానంగా నేను మర్చిపోలేని సంఘటన.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X