ఎన్టీఆర్‌ అదుర్స్ స్టోరీ లైన్ ఏమిటంటే...

By Srikanya

ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రెడీ అయి రేపు(బుధవారం) రిలీజ్ కానున్న అదుర్స్ చిత్రం స్టోరీ లైన్ అంటూ ఓ కథనం వినపడుతోంది. దాని ప్రకారం ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్ర డాన్ నరసింహం,మరొకటి బ్రహ్మణ పాత్ర నరసింహాచారి. వీరిద్దరూ కవలలు. చిన్నప్పుడే వీరిద్దరూ విడిపోతారు. అలాగే వీరి తండ్రిని హృతిక్ రోషన్ క్రిష్ లో మాదిరి కిడ్నాప్ చేస్తారు విలన్. ఇక డాన్ గా నరసింహం కాస్త నెగిటివ్ షేడ్స్ తో తన సామ్రాజ్యాన్నిఎదురులేకుండా ఏలుతూంటాడు. అలాగే అతనికి రైవల్ గ్రూప్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. రెండో పాత్ర నరసింహాచారి మాత్రం బ్రహ్మానందం దగ్గర శిష్యరకం చేస్తూంటాడు. అతని వెనక తిరుగుతూంటాడు. బ్రహ్మానందం అతన్ని ఆడుకుంటూంటాడు. ఈ లోగా సింగ్ ఈజ్ కింగ్ చిత్రంలోలా ఎన్టీఆర్ కి తనకో డాన్ అన్న ఉన్నాడని తెలుస్తుంది. అతన్ని తీసుకుని రావటానికి బయిలుదేరతాడు. ఇంటర్వెల్ కు ముందు ఇద్దరూ తారుమారు అవుతారు.

డాన్ ప్లేస్ లో కి చారి పాత్ర వెళ్ళుతుంది. మరో ప్రక్క డాన్ పాత్ర ఇక్కడకు వస్తుంది. అక్కడనుంచి కామెడీ హిలేరియస్ గా మారుతుంది. నరసింహాచారిని నరసింహం అనుకుంటారు. అతను డాన్ లా ఉండాలని ప్రయత్నిస్తూ ఫైట్స్ చేస్తూంటాడు. అయితే అలవాటు లేని వ్యవహారం కావటంతో ఇబ్బంది పడుతూంటాడు. అలాగే డాన్ పాత్రను బ్రహ్మానందం ఆడుకుందామని చూసి దెబ్బతింటాడు. అలా తాము చేరిన చోట వీళ్ళు మూలంగా ఇబ్బందులు వస్తాయి. ఈమధ్యలో విలన్స్ కు డాన్ నరసింహం స్ధానంలో వేరొకరు ఉన్నారని తెలుస్తుంది. మరో ప్రక్క ఇద్దరు అన్నదమ్ములకు తమ తండ్రిని విలన్స్ బారి నుంచి రక్షించుకోవాల్సిన భాద్యత ఉంటుంది. క్లైమాక్స్ లో ఇద్దరూ కలిసి ఎలా ఫైట్ చేసారన్నది కథ అంటున్నారు. ఇక ఈ కథ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నది. ఇది రూమర్ కూడా కావచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X