బోయపాటికి మళ్లీ ట్విస్టు ఇచ్చిన ఎన్టీఆర్
సింహాతో హిట్టు కొట్టిన బోయపాటి శ్రీనుని పిలిచి ఎన్టీఆర్ చిత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏ కథ బోయపాటి చెప్పినా ఏదో వంక చెప్పి చాలా కాలం స్క్రిప్టు ఓకే చెయ్యకుండా తిప్పి పంపిన ఎన్టిఆర్ ఎట్టకేలకు షూటింగ్ కి గ్రీన్ సిగ్న్లల్ ఇచ్చాడు.అయితే అదే సమయంలో సురేంద్ర రెడ్డితో ఊసరివిల్లిని కూడా ప్రారంభించేసాడు.అయితే బోయపాటి శ్రీను,సురేంద్ర రెడ్డి సినిమాలు రెండూ ఒప్పుకుని ఆల్టర్నేటివ్ గా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చి బోయపాటి శ్రీను ని కొద్ది రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసారని తెలుస్తోంది.బోయపాటి నిర్మాత కూడా దానికి ఓకే అన్నాడని చెప్తున్నారు.దేనికి ఈ బ్రేక్ అంటే ఊసరివిల్లిని ఫినిష్ చేసి వస్తానని చెప్పాట్ట.
ఎన్టీఆర్ పూర్తి దృష్టి మొత్తం సురేంద్ర రెడ్డి చిత్రం మీదే పెట్టి పనిచేస్తున్నాడని చెప్తున్నారు.బోయపాటి శ్రీను కథ మీద అసంతృప్తి ఉండి ఇలా చేస్తున్నాడనే టాక్ బయిట స్పెడ్ అవుతోంది.అయితే ఎన్టీఆర్ మాత్రం తాను ఊసరివిల్లిలోచేయాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్ కి పూర్తి న్యాయం చేయాల్సి ఉందని,అందుకే ఈ గ్యాప్ అడిగానని చెప్తున్నాడని తెలుస్తోంది.ఇలా అయితే బోయపాటి సినిమా వచ్చే సంవత్సరమే రిలీజ్ అని చెప్తున్నారు.సురేంద్రరెడ్డి కూడా కిక్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ చిత్రంపై పూర్తి దృష్టి పెట్టి వర్క్ చేస్తున్నాడని చెప్తున్నారు.గ్యారెంటీగా హిట్ ఇవ్వాలని,తమ కాంబినేషన్ లో గతంలో వచ్చిన అశోక్ రేంజిని దాటాలని ప్రయత్నిస్తున్నాడు.తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











