Nandamuri ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే న్యూస్.. ఒకే ఫ్రేమ్ లో బాలకృష్ణ, ఎన్టీఆర్.. ఎప్పుడంటే?
నందమూరి అభిమానులకు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఒక ఫ్రేమ్ లో కనిపించడం అనేది ఎప్పటికీ ట్రీట్ అనే చెప్పాలి. ఏవో కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ ఉండేది. కానీ హరికృష్ణ మరణం తరువాత ఆ గ్యాప్ తగ్గింది. ఇక ఏదో ఒక రోజు వారు కలిసి వచ్చి తమకు పెద్ద ఆనందాన్ని ఇస్తారని అభిమానులు ఎప్పుడూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చినట్లు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ఓ టాక్ షో
తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ఇస్తూ, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు అందిస్తూ విజయవంతగా దూసుకుపోతున్న ఓటీటీ ఆహా. సినిమాలు, వెబ్ సిరీస్ లకు పరిమితం కాకుండా గేమ్ షోస్.. టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఇతర ఓటీటీ ప్లాట్ఫాంలకి మంచి పోటీనిస్తుంది. అయితే గతంలో సమంతతో సామ్ జామ్ అనే టాక్ షో నిర్వహించిన ఈ ఓటీటీ ఇప్పుడు ఈసారి ఏకంగా నందమూరి నటసింహం బాలకృష్ణతో ఓ టాక్ షోను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అన్ స్టాప్ బుల్ విత్ ఎన్బీకే
అసలు విషయం ఏంటంటే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణతో కలిసి ఆహా ఓటీటీ సంస్థ అన్ స్టాప్ బుల్ విత్ ఎన్బీకే అనే ఒక టాక్ షో చేస్తోంది. ఈ టాక్ షో కి సంబంధించిన మొట్టమొదటి ఎపిసోడ్ ప్రోమో కూడా ఆదివారం నాడు రిలీజ్ అయింది ఈ మొట్ట మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు, మంచు విష్ణు మంచు లక్ష్మి లు కనిపించగా ఈ మొదటి ఎపిసోడ్ నవంబర్ 4వ తేదీన దీపావళి సందర్భంగా స్ట్రీమ్ కాబోతోంది.

స్పెషల్ లుక్ లో
ఇక మొట్ట మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో షో మీద ఆసక్తి పెంచేస్తోంది. ఈ షో నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానుంది. మొత్తం 12 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక మొదటి ఎపిసోడ్ ప్రోమోలో బాలయ్య లుక్ అదిరిపోయింది. స్పెషల్ లుక్ లో ఆయన కనిపిస్తున్నారు. చూడాలి మరి ఈ షో ద్వారా బాలయ్య ఇంకెంత మందికి దగ్గరవుతాడనేది.

గెస్ట్ ఫైనల్
అయితే ఇప్పటికే దాదాపు 5 ఎపిసోడ్ లకు సంబంధించిన గెస్ట్ లను ఫైనల్ చేశారని అంటున్నారు. ఆ గెస్ట్ లిస్టులోని ఎన్టీఆర్ పేరు ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదటి ఎపిసోడ్ మంచు ఫ్యామిలీతో పూర్తి చేసిన నందమూరి బాలకృష్ణ రెండో ఎపిసోడ్ రానాతో మూడవ ఎపిసోడ్ నానితో అలాగే 4 ఎపిసోడ్ ప్రభాస్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆ ఎపిసోడ్ లో కలిసి
ఇక ఐదో ఎపిసోడ్ తమ అన్న కొడుకు ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ లోనే కళ్యాణ్ రామ్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కానీ అది అయితే ఇంకా ఫైనల్ కాలేదు. కాకపోతే ఎన్టీఆర్ కనిపించడం అనేది ఫిక్స్ అని అంటున్నారు.ఇక ఇప్పటివరకు వెండితెరపై తనదైన సత్తా చూపించిన బాలయ్య.. బుల్లితెరపై ఎలాంటి సందడి చేయనున్నారు అని అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











