NTR30: ఎన్టీఆర్ - కొరటాల మూవీ మళ్లీ వాయిదా.. అన్ని నెలలు లేట్ ఎందుకో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. బ్యాగ్రౌండ్‌తో వచ్చినా తన సత్తాను నమ్ముకున్న అతడు.. ఆరంభంలోనే ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు. దీంతో అతడు స్టార్‌డమ్‌ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, సినిమా సినిమాకూ మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. ఇక, ఆ మధ్యలో వరుసగా పరాజయాలు ఎదురైనా.. 'టెంపర్' నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన తారక్.. వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను అందుకున్నాడు.

ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, భారీ కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది. అలాగే, ఎన్టీఆర్ రేంజ్‌ను పాన్ ఇండియా లెవెల్‌కు పెంచేసింది. ఈ ఉత్సాహంతోనే ఈ తారక్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసి డౌట్లకు పుల్‌స్టాప్ పెట్టారు.

NTR and Koratala Shiva Movie Postponed to September

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని కూడా డైరెక్టర్ కొరటాల శివ కొద్ది రోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి దీనికోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జూలై నెల కూడా వచ్చేసింది. కానీ, సినిమా ప్రారంభం గురించి ఎలాంటి ప్రకటనా రాలేదు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో రాబోయే ఈ సినిమాను జూలైలో ప్రారంభించడం లేదట. అంతేకాదు, దీన్ని వచ్చే సెప్టెంబర్ నెల నుంచి మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. అయితే, దీనికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. కానీ, ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవడంతో నందమూరి ఫ్యాన్స్‌లో మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని గ్లిమ్స్ వీడియో ద్వారా స్పష్టం చేశారు. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు.. అన్ని సిస్టమ్‌లను ఎదురించే శక్తిలా ఎలా ఎదిగాడు అన్న కథతో ఇది రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X