RRR వాయిదా పడడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఎలా ఉన్నారంటే?
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత అంతకు మించి అనేలా సక్సెస్ అందుకోవాలి అని RRR ఆర్ సినిమాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. రేపు మాపో సెన్సార్ పనులు కూడా ఫినిష్ అవుతాయి అనుకున్న సమయంలో హఠాత్తుగా ఓమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ అవడంతో ఈ సినిమాను వాయిదా వేయక తప్పలేదు. సినిమా వాయిదా పడింది అనగానే హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే దర్శకుడు రాజమౌళి కూడా ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్లి నట్లు తెలుస్తోంది.

పాజిటివ్ వైబ్రేషన్స్
రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా చాలా మంచి ఎమోషన్ ఉంది అని ట్రైలర్ ద్వారానే క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా విడుదలైన పాటలు కూడా అభిమానుల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు
న్యూ ఇయర్ ముందు వరకు కూడా చిత్ర దర్శకుడు రాజమౌళి అలాగే రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు కూడా విరామం లేకుండా అన్ని భాషలలో ప్రమోషన్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కేవలం ప్రమోషన్స్ కోసమే 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా టాక్ అయితే వచ్చింది.

ఎప్పుడు విడుదల అవుతుందో..?
ఖర్చుతో పాటు ఎంతో ఓపికతో సమయాన్ని వెచ్చించి చేసిన ప్రమోషన్స్ వృధా అయ్యిందనే చెప్పాలి. RRR ఆ సినిమా వాయిదా పడడం ఈసారి కొత్త కాదు. రెండుసార్లు సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా ఆ తర్వాత మరో రెండుసార్లు కరోనా వలన్క్ వాయిదా పడింది. ఇక ఐదవసారి ఓమిక్రాన్ దెబ్బతో ఎప్పుడు విడుదల అవుతుందో కూడా క్లారిటీ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

డిప్రెషన్ లో RRR
ఈ సినిమా కోసం కష్టపడి గ్యాప్ లేకుండా చేసిన ప్రమోషన్ కూడా వృధా అయింది అని దర్శకుడు రాజమౌళి అలాగే చిత్ర నిర్మాత, హీరో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా డిప్రెషన్ కి లోను అయినట్లు సమాచారం. ఇంతవరకు సోషల్ మీడియా ద్వారా వీరు ఎవరు యాక్టింగ్ గా లేరు. కనీసం వాయిదాపై కూడా పెద్దగా స్పందించింది లేదు.

ఎవరిలోను ప్రశాంతత లేదు..
ఇంటికి ఎవరు వచ్చినా కూడా రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలవడానికి ఇష్ట పడడం లేదట. 450 కోట్ల భారీ బడ్జెట్ సినిమా కాబట్టి తప్పకుండా హీరోలిద్దరూ పైనే కాకుండా దర్శకుడిపై మరింత ఒత్తిడి ఉంటుంది. సినిమా వాయిదా పడింది అనగానే అందరు కూడా చాలా సైలెంట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు అంటే పరిస్థితులను బట్టే సర్దుకుపోయి ముందుకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్రమోషన్ చేసిన తర్వాత ఇలా చేదు అనుభవం ఎదురవడంతో ఎవరు కూడా ప్రశాంతంగా లేరని సమాచారం.
Recommended Video

రిలీజ్ ఎప్పుడంటే?
ఇక RRR సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంలో గత కొన్ని రోజులుగా ఒక రూమర్ అయితే గట్టిగానే వైరల్ అవుతుంది. అన్నీ కుదిరితే ఏప్రిల్ నెలలోనే సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కానీ ఆ సమయంలోనే మహేష్ బాబు సర్కారు వారి పాట, విజయ్ బీస్ట్, యష్ KGF చాప్టర్ 2 వంటి పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సమయంలో రాజమౌళి ఎలాంటి ప్రణాళికలు రచిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











