Just In
Don't Miss!
- Finance
5 నెలల్లో రూ.8500 తగ్గిన బంగారం, వెండి రూ.14,000 డౌన్: 2009 తర్వాత తొలిసారి...
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'ఊసరవెల్లి' నిర్మాతపై ఎన్టీఆర్ ఫైరింగ్
ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి ఈ నెల ఆరవతేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.అయితే రిలీజ్ డేటు దగ్గరపడుతున్నా ప్రమోషన్ పెద్దగా కనపడటం లేదని ఎన్టీఆర్ చిర్రెత్తిపోతున్ననాడని, నిర్మాతను ఈ విషయమై కోప్పడ్డాడని ఫిల్మ్ నగర్ టాక్. అంతేగాక ఫిల్మ్ డిస్ట్ర్రిబ్యూటర్స్ ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు కూడా ఎక్కడా ఈ సినిమా గురించి పెద్దగా పబ్లిసిటీ చేయకపోవటం ఎన్టీఆర్ కోపానికి కారణమయ్యిందిట. చాలామంది అతని ఫ్యాన్స్.. ఫోన్ చేసి చాలా ఏరియాల్లో ఊసరవెల్లి ఫలానా తేదీన విడుదల అవుతుందనే సంగతి కూడా తెలియలేదని చెప్పటం జరిగిందట. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్టీఆర్ కోప్పడుతున్నాడని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క మహేష్ తాజా చిత్రం దూకుడు కొంచెం కూడా తగ్గకపోవటం కూడా ఎన్టీఆర్ క్యాంప్ ని కలవరపెడుతున్న అంశం. రోజు రోజుకూ దూకుడు ప్రమోషన్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు.
ఎక్కడ చూసినా దూకుడు గురించి, ఆ చిత్రం కలెక్షన్స్ గురించే వినపడటం కూడా ఎన్టీఆర్ తన సినిమా మీద ఏమన్నా ప్రభావం పడుతుందా అనే ఆలోచనలో పడుతున్నాడట. అయితే సినిమా బాగా వచ్చిందని, గ్యారెంటీగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాడు. ఇక ఊసరివిల్లి చిత్రం కూడ ఇప్పుడు క్లిక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శక్తి చిత్రం ఎన్టీఆర్ కి చాలా చేదు అనుభవాన్ని ఇచ్చింది. అలాగే ఊసరవెల్లి చిత్రానికి కూడా మంచి టాక్ ఉండటం కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఆ సినిమా ఎన్టీఆర్ గత చిత్రం రికార్డులను తిరగ రాస్తుందని చాలా మంది అంటున్నారు. ఎన్టీఆర్ ఓ ప్రేమికుడుగా కనిపించే ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్బుతంగా వచ్చాయని టాక్. ఇక ఈ దసరాకి ఈ రెండు సినిమాల మధ్యే పోటీ అనేది మాత్రం నిజం.