ఎన్టీఆర్ మరో రీ-మిక్స్

By Staff

ఎలక్షన్ల పర్వం ముగిసాకా వరుసగా సినిమాలు చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని, గన్నవరం వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రం అనంతరం మున్నా ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలోదిల్ రాజు నిర్మించే "బృందావనం" లో నటించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర షూటింగ్ నవంబర్ 7న ప్రారంభం కానుంది.

హ్యాపీడేస్, కొత్తబంగారులోకం లాంటి సంచలన విజయాలతో జోష్ మీదున్న మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. "బృందావనం" చిత్రానికి "గోవిందుడు అందరివాడేలే" అనేది ఉపశీర్షిక. ఈ రెండూ సింక్ అయ్యేలా అలనాటి క్లాసికల్ మూవీ మిస్సమ్మ చిత్రంలోని "బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే" అనే పాటని రీ-మిక్స్ చెయ్యబోతున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో "ఓలమ్మి తిక్కరేగిందా" పాటకు మంచి స్పందన వచ్చింది, అలాగే ఇటీవల విడుదలైన రామ్ చరణ్ తేజా మగధీర చిత్రంలోని "బంగారు కోడి పెట్ట" పాట ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగిస్తోంది. మరి ఈ పాట ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఆడియో విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే. అన్నట్టు ఈ చిత్ర ఆడియోను 2010 ఫిబ్రవరి లోనూ, సినిమాను 24 మార్చి 2010 లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే తేదీన విడుదలైన ఆది చిత్రం ఏన్నో రికార్డులను సృష్టించింది. ఈ పాట ఆదరణపొందితే మరిన్ని రీ-మిక్స్ పాటలు వస్తాయనడం నిస్సందేహం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X